|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: బాలయ్య పేరుతో మంచు లక్ష్మి ఊచకోత! గోదారిలో ఏం జరిగిందో తెలుసా?

Published: 07-04-2026, 9:35 AM
షాకింగ్: బాలయ్య పేరుతో మంచు లక్ష్మి ఊచకోత! గోదారిలో ఏం జరిగిందో తెలుసా?
  • గుండెల్లో గోదారి షూటింగ్ కోసం బాలయ్య పేరుతో ఊరిని మోసం చేసిన మంచు లక్ష్మి!
  • 300 మంది జూనియర్ ఆర్టిస్టుల కోసం ఏకంగా 3000 మందిని రప్పించిన లక్ష్మి ప్లాన్ వైరల్
  • బాలయ్య వస్తున్నాడని పుకారు పుట్టించి జనాన్ని తరలించిన మంచు లక్ష్మి తెలివి!
  • రాజా రవీంద్ర ఇంటర్వ్యూలో గుండెల్లో గోదారి మూవీ సీక్రెట్స్ బయటపెట్టిన మంచు లక్ష్మి.

మంచు లక్ష్మి గురించి ఒక సంచలన విషయం బయటకి వచ్చింది. ఆమె బాలయ్య బాబు పేరు చెప్పి ఒక ఊరిని మోసం చేసిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చదవండి.

బాలయ్య పేరుతో మాయ చేసిన మంచు లక్ష్మి

Manchu Lakshmi : మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ముంబైకి షిఫ్ట్ అయింది. ఇటీవలే తన కూతురు ఓణీల వేడుకను ఘనంగా చేసి వైరల్ అయింది. తాజాగా మంచు లక్ష్మి రాజా రవీంద్ర యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.

ఈ ప్రోమోలోనే లక్ష్మి చెప్పిన బోలెడన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాను నిర్మాతగా, హీరోయిన్ గా చేసిన గుండెల్లో గోదారి సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన తెలిపింది.

గుండెల్లో గోదారి సీక్రెట్స్ రివీల్

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. వెస్ట్ గోదావరి లో షూటింగ్ చేస్తున్నాము. మాకు ఒక మూడొందల మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి. మా దగ్గర 30 మందే ఉన్నారు. 300 మందిని ఎక్కడ్నుంచి తీసుకురావాలి అనుకున్నా. నా ప్రొడ్యూసర్ బ్రెయిన్ ఉపయోగించా. ఊళ్ళో బాలయ్య బాబు వస్తున్నాడు అని పుకారు పుట్టించా. దాంతో మా షూటింగ్ స్పాట్ కి ఏకంగా 3000 మంది ఊరు ఊరంతా వచ్చారు. మేము కెమెరా ఎలా పెట్టినా, ఎటు వైపు పెట్టినా ఫుల్ జనాలే ఉన్నారు అని చెప్పుకొచ్చింది.

రాజా రవీంద్రతో లక్ష్మి ఇంటర్వ్యూ వైరల్

అలా మంచు లక్ష్మి బాలయ్య బాబు పేరు చెప్పి ఊరందర్నీ మోసం చేసి తన షూటింగ్ లో వాడుకుంది. ఈ ఇంటర్వ్యూలో ఇంకెన్ని ఆసక్తికర విషయాలు చెప్పిందో అని ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు.

మంచు లక్ష్మి చేసిన ఈ పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు చెప్పింది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.