|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు.. తనకి నేను కర్ణుడ్ని’: మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

Published: 21-06-2025, 1:10 PM
‘నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు.. తనకి నేను కర్ణుడ్ని’: మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్‌ను తన జీవితంలోని కృష్ణుడిగా పిలుస్తూ, తనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. విష్ణు ప్రకారం, ప్రభాస్ చాలా మంచి మానవతావాది.

Key Points

1

మంచు విష్ణు ప్రభాస్‌ను తన జీవితంలోని కృష్ణుడిగా పేర్కొన్నారు.

2

ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించడానికి మోహన్ బాబుతో ఉన్న అనుబంధం కారణమని విష్ణు తెలిపారు.

4

కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది.

మంచు విష్ణు ప్రభాస్‌పై ప్రశంసలు

కన్నప్ప(Kannappa Movie) ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ప్రభాస్‌పై(Prabhas) నటుడు మంచు విష్ణు(Manchu Vishnu) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్నేహితులలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. అందులో ఒకరు కృష్ణుడి లాంటి వారు.. ఇంకొకరు కర్ణుడు లాంటి వారు.. మేము కూడా సేమ్ అలాగే.. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు అయితే.. తనకి నేను అర్జునుడిని. ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే చాలా పెద్ద హీరో. అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ.. కేవలం నా తండ్రి మోహన్ బాబు మీదున్న ప్రేమ, అభిమానం, గౌరవంతోనే ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని నేను పదే పదే ప్రభాస్ ముందు కూడా చెప్పాను. నువ్వు నాకోసం కాదు.. మా నాన్న కోసమే ఈ సినిమా ఒప్పుకున్నావని రోజూ ఏడిపిస్తుంటాను. తను కూడా కాంప్రమైజ్ అవ్వకుండా.. నిజమే నీకోసం కాదు.. మా బావ మోహన్ బాబు కోసమే చేశాను అని చెబుతుంటాడు. ప్రభాస్ అభిమానులకు ఒక విషయం చెప్పాలి ప్రభాస్ చాలా పెద్ద మానవతావాది. డబ్బు వచ్చినా.. పేరు వచ్చినా కొందరిలో చాలా మార్పు చూస్తాం. కానీ ప్రభాస్‌లో అవేమీ కనిపించవు. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన ఇండస్ట్రీలో ఉండటం మనందరికీ గర్వకారణం’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, కన్నప్ప మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధు, ముఖేష్ రిషితో పాటు మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు స్వయంగా మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వీడియో

కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైలైట్స్

ప్రభాస్ మానవతావాదంపై మంచు విష్ణు వ్యాఖ్యలు

ప్రభాస్‌కు మంచు విష్ణు తన అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేస్తూ, కన్నప్ప సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రభాస్‌లోని మంచి గుణాలను ప్రశంసిస్తూ తన వ్యాఖ్యలను ముగించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.