|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Manchu Vishnu: ఆ భయానికే కన్నప్పను వాయిదా వేశా: మంచు విష్ణు

Published: 29-06-2025, 8:56 AM
Manchu Vishnu: ఆ భయానికే కన్నప్పను వాయిదా వేశా: మంచు విష్ణు

మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతోంది. ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని, దానికి కారణం సంచలన దర్శకుడు ఆర్జీవీ అని విష్ణు వెల్లడించారు.

Key Points

1

కన్నప్ప సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతోంది.

2

ఆర్జీవీ సలహా మేరకు మంచు విష్ణు సినిమాను వాయిదా వేశారు.

4

సినిమాలోని కొన్ని సన్నివేశాలను మేకర్స్ తొలగించారు.

కన్నప్ప సినిమా సక్సెస్

కన్నప్ప మూవీతో సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు హీరో మంచు విష్ణు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరెకెక్కించిన కన్నప్ప ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో కన్నప్ప బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు.

ఆర్జీవీ సలహా

ఈ సందర్భంగా కన్నప్ప సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు మంచు విష్ణు హాజరై మాట్లాడారు. కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సంచలన డైరెక్టర్‌ ఆర్జీవీ వల్లే తాను మూవీని పోస్ట్‌పోన్ చేశానని వెల్లడించారు. దీనికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు.

వీఎఫ్ఎక్స్ పనులు

మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘నా జనరేషన్‌లో నేను నమ్మే డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ. ఇవాళ ఆయన నాకు ఓ మేసేజ్ పెట్టాడు. మార్చిలో నాన్నగారిని కలవడానికి వచ్చారు. ఆ రోజు ఇంట్లో కన్నప్ప సినిమా మేకింగ్‌ నాలుగు నిమిషాల వీడియోను ఆయనకు చూపించాను. మీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్..ఎక్స్‌ట్రార్డినరీ అని వీవీఎస్ రవి అన్నారు. ఈ మాట విన్న రాంగోపాల్ వర్మ ఒక మాట అన్నారు. ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్‌ను వదిలిపెడతాడా.. అవీ కూడా బ్రహ్మండగానే ఉంటాయి అన్నారు. అది విన్న తర్వాత భయపడి పోస్ట్‌పోన్ చేసేశా. ఈ రోజు కూడా టెక్నికల్‌గా మా డైరెక్టర్‌, ఎడిటర్‌, నేను చాలా సీక్వెన్స్‌లు వదిలిపెట్టేశాం. మేము అనుకున్నంతగా వీఎఫ్‌ఎక్స్ రాలేదు. ఇది మాకు ఒక పెద్ద గుణపాఠం’ అని వెల్లడించారు.

చివరగా, కన్నప్ప సినిమా విజయవంతం కావడానికి కృషి చేసిన మొత్తం బృందాన్ని మంచు విష్ణు అభినందించారు. వీఎఫ్ఎక్స్ పనులలో వచ్చిన అనుకోని సమస్యలను గురించి కూడా ఆయన వివరించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.