|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్, ప్రభాస్ సినిమాల కంటే మా కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్

Published: 06-06-2025, 4:20 AM
పవన్, ప్రభాస్ సినిమాల కంటే మా కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్

మంచు విష్ణు నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కానుంది. తాజా ఇంటర్వ్యూలో మంచు విష్ణు, కన్నప్ప సినిమా బడ్జెట్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల కంటే ఎక్కువ అని చెప్పడం విశేషం.

Key Points

1

కన్నప్ప సినిమా బడ్జెట్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల కంటే ఎక్కువ.

2

మంచు విష్ణు ఇచ్చిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్.

4

జూన్ 27న కన్నప్ప సినిమా విడుదల.

కన్నప్ప సినిమా బడ్జెట్ వివరాలు

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం ” కన్నప్ప “(Kannappa). ముకేశ్‌ కుమార్‌సింగ్‌(Mukesh Kumar Sing) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్(Prabhas) కనిపించనున్నారు. అలాగే మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్(Mohanlal), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), శరత్ కుమార్(Sarathkumar).. బ్రహ్మానందం(Brahmanandam), మధుబాల(Madhubala), ముఖేష్ రిషి(Mukesh Rishi) సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ చిత్రం జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మంచు విష్ణు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కడ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘కన్నప్ప బడ్జెట్ ట్రిపుల్ ఫిగర్స్‌లో ఉంది. నేను కన్నప్ప బడ్జెట్ చెప్తే రేపు పొద్దున్న IT వాళ్ళు మా ఇంటి ముందు క్యూ కడతారు. రాజా సాబ్(Raja Saab), ఓజీ(OG) సినిమాల కంటే మా కన్నప్ప బడ్జెట్ చాలా ఎక్కువ’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

మంచు విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు

కన్నప్ప సినిమా విడుదల తేదీ

మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కన్నప్ప సినిమా బడ్జెట్ ఎంత అనేది ఇంకా రహస్యంగానే ఉంది. సినిమా విజయవంతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.