
జూలై 1న మంగళవారం సుబ్రహ్మణ్య షష్టి. ఈ పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, మంత్రాలు జపించడం, పరిహారాలు పాటించడం వల్ల సమస్యల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
Key Points
సుబ్రహ్మణ్య షష్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి.
“ఓం శరవణ భావాయ విద్మహే కార్తికేయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్” మంత్రాన్ని జపించండి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం చేయండి లేదా అభిషేకం చేయించుకోండి.
కుజదోషం, కాలసర్పదోషం, పితృశాపం వంటి సమస్యలకు పరిహారం లభిస్తుంది.
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన
చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలంటే కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. కొన్ని పరిహారాలను పాటించడం వలన సంతోషంగా ఉండవచ్చు. ఎటువంటి బాధలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే సమస్యల నుంచి బయటపడడానికి పరిహారాలను పాటించడానికి జూలై 1 చాలా మంచి రోజు.
జూలై 1న మంగళవారం, పైగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి వచ్చింది. ఈరోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన సమస్యల నుంచి బయటపడొచ్చు, సంతోషంగా జీవించొచ్చు.
మంగళవారం + సుబ్రహ్మణ్య షష్టి రావడం చాలా మంచిది. దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. సంతానం లేని వారు, సంతానం అభివృద్ధి లేని వారు ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది.
సంతానం లేని వారు, సంతానంలో సమస్యలు ఉన్నవారు ఇలా చేస్తే మంచిది:
శక్తివంతమైన మంత్రాలు
ఈ మంత్రాన్ని జపించండి: “ ఓం శరవణ భావాయ విద్మహే కార్తికేయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్.”
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసి వీలైనంత సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం కనబడుతుంది. సమస్యలన్నీ తగ్గిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు.
ఈ విశేషమైన రోజున ఇలా కూడా చేయొచ్చు
సుబ్రహ్మణ్య స్వామికి మహా ప్రీతికరమైన రోజు కావడంతో, ఈ రోజున కుజ దోషం ఉన్నవారు, కాల సర్ప దోషం, పితృ శాపం, వివాహం కానివారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు, సంతానం కలగకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు వంటివి తొలగిపోవాలన్నా ఈ షష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది.
సమస్యలకు పరిహారాలు
ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం జరిపితే కూడా మంచి జరుగుతుంది, సమస్యలు గట్టిక్కుతాయి. అలాగే ఈ సమస్యలన్నీ తీరాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుంటే మంచిది.
ఈ మంత్రాన్ని పఠిస్తే కూడా మీ సమస్యలన్నీ తీరిపోతాయి:
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ విశేష దినాన్ని సద్వినియోగం చేసుకుని, భక్తితో పూజలు, మంత్రజపం చేయడం ద్వారా సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


