|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘మంగపతే కరెక్ట్’ అషురెడ్డి గ్లామరస్ ఫోటోలపై నెటిజన్ల ఆగ్రహం, ట్రోలింగ్ వెనుక కారణం ఏంటి?

Published: 29-12-2025, 1:18 PM
'మంగపతే కరెక్ట్' అషురెడ్డి గ్లామరస్ ఫోటోలపై నెటిజన్ల ఆగ్రహం, ట్రోలింగ్ వెనుక కారణం ఏంటి?
  • అషురెడ్డి టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయి, జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
  • ఆమె తరచుగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు.
  • తాజా ఫోటోలపై ‘మంగపతే కరెక్ట్’ వంటి ట్రోల్స్, విభిన్న కామెంట్స్ వస్తున్నాయి.
  • అషురెడ్డి ఇలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోకుండా తన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

అషురెడ్డి లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. కొందరు ఆమె అందాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ‘మంగపతే కరెక్ట్’ అంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అషురెడ్డి: జూనియర్ సమంత నుండి గ్లామర్ క్వీన్ వరకు

Trolls On Ashu Reddy: అషురెడ్డి పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో ఎంతోమంది సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అలాంటి వారిలో అషురెడ్డి (Ashu Reddy) ఒకరు. టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె కాస్త సమంత పోలికలతో కనిపించడంతో జూనియర్ సమంత అంటూ ఈమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.. ఇలా జూనియర్ సమంతగా సోషల్ మీడియా వేదికగా అషురెడ్డి నిత్యం ఎన్నో వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేశారు. టిక్ టాక్ యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన అషురెడ్డి యాంకర్ గా మారి పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశారు.

ఇలా నటిగా యాంకర్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న అషురెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా ఈమె తన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తాజాగా మరికొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు. ఎద అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అందమైన ప్రకృతిలో నడుమ తన అందాలను ఆరబోస్తూ అషురెడ్డి దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

గ్లామరస్ ఫోటోలపై నెటిజన్ల భిన్న స్పందనలు

అషురెడ్డి ఈ ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా నేటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సో హాట్ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం మీకు మంగపతే కరెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం అన్ని గ్రాఫిక్స్, మొత్తం సర్జరీలు అంటూ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అషురెడ్డి గురించి సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్ రావడం సర్వసాధారణం అయితే వీటన్నింటిని ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం కేర్ చేయకుండా తనుకు నచ్చిన విధంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.

ట్రోల్స్ పట్టించుకోని అషురెడ్డి ధోరణి

ఇటీవల సెలబ్రిటీ వస్త్ర ధారణ విషయం గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు చక్కగా అందగా చీర కట్టుకొని వస్తే బాగుంటుందని, సా*న్లు కనిపించేలా బట్టలు వేసుకోవద్దంటూ ఆయన మాట్లాడారు. దీంతో శివాజీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మహిళలను కించపరుస్తూ శివాజీ మాట్లాడారు అంటూ ఎంతో మంది శివాజీ పై విమర్శలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అషురెడ్డి ఇలాంటి ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు కూడా మీకు మంగ పతే కరెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అషురెడ్డి తరచుగా ట్రోల్స్‌కు గురైనప్పటికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై నెటిజన్ల తీరు, అభిప్రాయాల మధ్య తేడాను ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.