|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మంగ్లీపై సంచలన ఆరోపణలు! చీటింగ్ కేసులో చిక్కులు! టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న వివాదాలు!

Published: 14-04-2026, 2:05 AM
మంగ్లీపై సంచలన ఆరోపణలు! చీటింగ్ కేసులో చిక్కులు! టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న వివాదాలు!
  • మంగ్లీ, ఆమె సోదరుడు, మరో వ్యక్తిపై 10 కోట్ల మోసం ఆరోపణలు, బాధితుల ఫిర్యాదు!
  • డైరెక్టర్ వేణు ఉడుగులపై కేసు నమోదు, టాలీవుడ్‌లో సంచలనం!
  • పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలు, పోలీసుల విచారణ!
  • కన్నడ పాటలో అసభ్యకర సన్నివేశాలు, మంగ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!

సింగర్ మంగ్లీ పేరు ఇప్పుడు మారుమోగుతోంది! చీటింగ్ కేసులో ఆరోపణలు ఆమెను చుట్టుముట్టాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది? మంగ్లీ ఈ ఆరోపణలపై ఎలా స్పందించింది? తెలుసుకోవాలంటే ఈ న్యూస్ చూడాల్సిందే!

మంగ్లీపై చీటింగ్ కేసు ఆరోపణలు!

ప్రస్తుతం చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నసింగర్ మంగ్లీ గతంలో కూడా ఎన్నో వివాదాలను ఫేస్ చేసింది. మంగ్లీ.. ఆమె తమ్ముడు శివ, మధు అనే మరో వ్యక్తి కలిసి దాదాపు 100 మందిని మోసం చేశారని ఆరోపణలుఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు పొందవచ్చు అని ఆశ చూపించి.. దాదాపు 10 కోట్లకు టోకరా పెట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈక్రమంలో బాధితుల తరపున నిలబడ్డ లాయర్ సుబ్బారావును చంపేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినిపించాయి. సుబ్బారావు స్వయంగా ఈ విషయంలో పోలీసులకు పిర్యాదు ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఈ విషయంలో డైరెక్టర్ వేణు ఉడుగుల మీద కూడా కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. సుబ్బారావు ఆరోపణలపై మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు పాట తప్పించి ఏమీ తెలియదని.. పాటే నా ప్రాణం అంటూ బాధపడింది. అంతే కాదు తనపై ఆరోపణలు చేస్తున్నవారిపై రివర్స్ కేసు పెట్టినట్టు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో మంగ్లీ పేరు?

రీసెంట్ గా సీపి సజ్జనార్ ను కూడా కలిసి.. తనపై జరుగుతున్న ఆరోపణలపై ఫిర్యాదు చేసింది మంగ్లీ. ఇక ఈ వివాదం ఎక్కడి వరకూ వెళ్తుందో తెలియదు.. కానీ పోలీసుల దర్యప్తు మాత్రం కొనసాగుతోంది. ఈక్రమంలో మంగ్లీ గత వివాదాలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలో కొన్ని విషయాల్లో మంగ్లీ తీరు వివాదానికి దారి తీసింది.

రీసెంట్ గానే ఆమె పుట్టిన రోజు వేడుకల్లో మాదక ద్రవ్యాలు వాడారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. చేవెళ్ల సమీపంలోని ఓ రిసార్ట్‌లో అనుమతి లేకుండా రాత్రి పూట డీజే మందు పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వారిలో ఒకరికి గంజాయి పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అయితే తనకు దీనితో ఎటువంటి సంబంధం లేదని, కేవలం కుటుంబ సభ్యులు, మిత్రులతో జరుపుకున్న వేడుక అని మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా పాటలు పాడుతూ బిజీగా ఉంది మంగ్లీ. ఈ క్రమంలోనే ఆమె ఓ కన్నడ సినిమాకు పాట పాడింది. కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం KD: ది డెవిల్. ఈ సినిమా సినిమా నుంచి “సర్కే చునర్ తేరి సర్కే” అంటూ ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయగా.. అది సంచలనంగా మారింది.

గతంలో మంగ్లీ వివాదాలు!

ఈ సాంగ్ మొత్తం అశ్లీలంగా ఉండటంతో నెటిజన్స్ ఈ పాట పై పెద్దెత్తున విమర్శలు చేశారు. మైనర్ల మనసుపై ప్రభావం పడుతుందని మండిపడ్డారు. ఈ పాట పై ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది కేసు కూడా వేశారు. దాంతో ఈసాంగ్ ను బ్యాన్ చేశారు. మంగ్లీ కూడా ఈ పాట విషయంలో క్షమాపణలు చెప్పారు.

ఇక గతంలె తెలంగాణ ఆషాఢం బోనాల సీజన్ లో మంగ్లీ పాడిన పాటపై విమర్శలు వచ్చాయి. ఆ పాటకు రామస్వామి సాహిత్యం అందించగా, రాకేశ్ వెంకటాపురం సంగీతం అందించారు. అయితే, ఆ భక్తి గీతంలోని కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అమ్మవారిని దూషిస్తున్నట్టుగా కొన్ని పదాలు ఉన్నాయంటూ భక్తులు మండిపడ్డారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం వంటి బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని, దేవతను మొక్కినట్టుగా కాకుండా, తిడుతున్నట్టుగా ఉందని, ఇలాంటి పాటను మంగ్లీ ఎలా పాడిందంటూ విమర్శలు వచ్చాయి. పలువురు పొలిటికల్ లీడర్లు కూడా ఈ విషయంలో మంగ్లీని విమర్శించారు. ఇలా కొన్ని వివాదాలు మంగ్లీ కెరీర్ లో ఎదుర్కొవలసి వచ్చింది.

మంగ్లీ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ కేసు విచారణ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.