
📌 Key Points
- మారుతి, యంగ్ హీరోతో ‘హ్యాపీ పొంగల్’ మూవీకి గ్రీన్ సిగ్నల్!
- ప్రభాస్ ‘రాజాసాబ్’ ఫ్లాప్ తర్వాత మారుతి కామెడీ ఎంటర్టైనర్ బాట పట్టారు.
- ఫ్లాప్ లో ఉన్న హీరోతో మారుతి హిట్ కొట్టే ప్రయత్నం!
- సొంత బ్యానర్ లోనే ‘హ్యాపీ పొంగల్’ సినిమా నిర్మాణం!
టాలీవుడ్ లో దర్శకుడు మారుతి ఒక సంచలనానికి తెర తీశారు. ప్రభాస్ తో ‘ది రాజాసాబ్’ సినిమా తర్వాత, ఇప్పుడు ఒక యంగ్ హీరోతో ‘హ్యాపీ పొంగల్’ అనే సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మారుతి ప్లాన్ ఏంటి?
Maruthi: టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇటీవల దారుణంగా ట్రోల్ అయిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మారుతీ అనే చెప్పాలి. ఈయన దర్శకత్వం వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచింది. రొటీన్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ ని కాదు కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కు సైతం నచ్చలేదు. దీంతో, సోషల్ మీడియాలో దర్శకుడు మారుతీపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ప్రభాస్ రేంజ్ హీరో దొరికితే అలాంటి సినిమానా తీసేది అంటూ కామెంట్స్ చేశారు.
దాంతో, మీడియా ముందుకు రావడం మానేశాడు మారుతీ(Maruthi). ఈనేపథ్యంలోనే తన కొత్త సినిమా విషయంలో పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడట. అవును, ది రాజాసాబ్ లాంటి డిజాస్టర్ తరువాత మరోసారి కామెడీ ఎంటర్టైనర్ కథతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడట మారుతీ. ఇటీవలే ఆ కథను ఒక యంగ్ హీరోకి వినిపించగా వెంటనే ఒకే చెప్పేశాడట. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడట మారుతీ.
‘హ్యాపీ పొంగల్’ విశేషాలు
అయితే, ఈ కథను ఒకే చేసిన హీరో ఎవరి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ హీరో కూడా ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో డీలా పడిపోయి ఉన్నాడట. ఆ హీరోతో తనను అచ్చొచ్చిన కామెడీ కంటెంట్ తో పక్కా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడట మారుతీ. ది రాజాసాబ్ విషయంలో తనను ఎంతలా ట్రోలింగ్ చేశారో అంతకంటే ఎక్కువ హిట్ కొట్టాలని చూస్తున్నాడట. ఈ మేరకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాడు.
హీరో ఎవరో తెలుసా?
ఈ సినిమాలో నటిస్తున్న హీరోకి సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఆ బ్యానర్ లోనే ఈ కొత్త సినిమాను తెరకెక్కించనున్నాడట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్. మరి ది రాజాసాబ్ లాంటి ప్లాప్ తరువాత మారుతీ చేస్తున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని ఇస్తుంది అనేది చూడాలి.
ది రాజాసాబ్ ప్లాప్ తరువాత మారుతి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం వేచి చూడండి.


