
ప్రముఖ నటి మీనా తన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను ఓ షోలో పంచుకుంది. తన గత ప్రేమ, వివాహం మరియు కుటుంబం గురించి ఆమె వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పై ఆమెకున్న ప్రేమ గురించి కూడా ఆమె మాట్లాడింది.
Key Points
మీనా హృతిక్ రోషన్ పై తన ప్రేమను వెల్లడించింది.
హృతిక్ రోషన్ పెళ్లి చేసుకున్న విషయం మీనాను బాధించింది.
మీనా తన కూతురు నైనిక సినీ ప్రవేశం గురించి మాట్లాడింది.
మీనా తన గత ప్రేమ, వివాహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
హృతిక్ రోషన్ పై మీనా ప్రేమ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగారు మీనా. ఇప్పుడు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. అదేసమయంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 48 ఏళ్ళ వయసులో కూడా 28 ఏళ్ళ హీరోయిన్‌లా కనిపిస్తున్న మీనా మూడు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. 6 సంవత్సరాల వయసులో సినీరంగ ప్రవేశం చేసిన మీనా, 42 సంవత్సరాలుగా నటిగా ఉన్నారు.
కోవిడ్ కారణంగా ఆమె భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతూ మరణించారు. ఆ తర్వాత, మీనా రెండో పెళ్లి చేసుకోలేదు. ఇటీవల, సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ తో మీనా వివాహం జరగబోతోందని వార్తలు వచ్చాయి.
ఈ పుకార్లకు మీనా చాలాసార్లు వివరణ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం మానేశారు. కానీ, ఆమె పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో, తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను మీనా పంచుకున్నారు.
ఓ తమిళ ఛానెల్‌లో నటి సుహాసిని నిర్వహించే షోలో పాల్గొన్న మీనా, తన ప్రేమ గురించి మాట్లాడారు. విద్యాసాగర్ ని పెళ్లి చేసుకునే ముందు ఎవరిని ప్రేమించారు?, ఆ లవ్ స్టోరీ చివరికి ఏమైంది? వంటి ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.
వివాహం, కుటుంబం గురించి మీనా అనుభవాలు
ఆ నటుడు పెళ్లి చేసుకున్నప్పుడు, నా మనసు విరిగిపోయిందని కూడా మీనా చెప్పారు. ‘ఒక బాలీవుడ్ నటుడిపై నాకు ప్రేమ ఉండేది. అతను పెళ్లి చేసుకున్న వార్త నన్ను చాలా బాధించింది’ అని మీనా అన్నారు.
‘హృతిక్ రోషన్ ని నేను చాలా ఇష్టపడేదాన్ని. ఆయనలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అమ్మతో చెప్పేదాన్ని. అప్పుడు నాకు పెళ్లి కాలేదు. ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడటం మొదలుపెట్టగానే, అమ్మతో ఇదే చెప్పేదాన్ని. దీన్ని హృతిక్ కి నేనెప్పుడూ చెప్పలేదు.
కానీ, ఆయనపై నాకు ప్రేమ ఉండేది నిజమే’ అని మీనా అన్నారు. `హృతిక్ పెళ్లి చేసుకున్న రోజు, నా మనసు విరిగిపోయింద`ని కూడా ఆమె చెప్పారు. అప్పుడు షోలో నటి సుహాసిని, మీనా, హృతిక్ కలిసి దిగిన పాత ఫోటోను పంచుకున్నారు.
కూతురు నైనిక సినీ ప్రవేశం
తన కూతురు నైనిక సినీరంగ ప్రవేశం గురించి కూడా మీనా మాట్లాడారు. ‘దీని గురించి నాకు సంతోషంగా ఉంది. విజయ్ నటించిన `తెరి` సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇది నాకు చాలా గర్వకారణం’ అని మీనా అన్నారు.
తన సినీ ప్రయాణం గురించి కూడా మాట్లాడిన ఆమె, `పడయప్ప`(నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ నటించిన విలన్ పాత్రలో మొదట నన్ను ఎంపిక చేశారు. కానీ, ఆ పాత్రలో నటించవద్దని నా అమ్మ చెప్పేసింది. అందుకే నేను నటించలేదు.
కథానాయికగా నటిస్తున్నప్పుడు, విలన్ గా నటిస్తే, అది నా సినీ ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుందని అమ్మ భావించారు. కానీ, తర్వాత ఆ పాత్రలో నటించి ఉండవచ్చేమో అని నాకూ అనిపించింది` అని మీనా అన్నారు. ఇప్పుడు మీనా చెప్పిన ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి.
మీనా గతంలోని ప్రేమ, వివాహం మరియు కుటుంబ జీవితం గురించి ఈ వీడియోలో ఆమె వెల్లడించిన విషయాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆమె కూతురు సినీ ప్రవేశం కూడా ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది.


