|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ప్రేమించిన కొద్ది నెలలకే బ్రేకప్ చెప్పిన తారా సుతారియా! అసలేం జరిగింది?

Published: 09-01-2026, 5:00 AM
షాకింగ్: ప్రేమించిన కొద్ది నెలలకే బ్రేకప్ చెప్పిన తారా సుతారియా! అసలేం జరిగింది?
  • తారా సుతారియా, వీర్ పహారియా బ్రేకప్ చెప్పకున్నట్లు వార్తలు.
  • దీపావళికి తమ ప్రేమను అధికారికంగా ప్రకటించిన జంట.
  • ఏపీ థిల్లాన్ కచేరిలో తారా ప్రవర్తనపై వీర్ అసౌకర్యంగా ఉన్నట్లు పుకార్లు.
  • తారా ఈ పుకార్లను ఖండిస్తూ, వీడియో ఎడిట్ చేయబడిందని తెలిపింది.

సినీ పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. తారా సుతారియా, వీర్ పహారియా ప్రేమ కథ కొద్ది నెలలకే ముగిసిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై తారా స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.

తారా, వీర్ ప్రేమ కథకు బ్రేక్?

Film industry:ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు అలా ఒక్కటవుతున్నారు.. ఇలా విడిపోతున్నారు.. అయితే ఎప్పుడు ఒక్కటవుతారు? ఎప్పుడు విడిపోతారు? ఏ కారణాల చేత బ్రేకప్ చెప్పుకుంటున్నారు? అనే విషయాలు మాత్రం తెలియక అభిమానులు కూడా సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కొత్త జంట కొత్త ఏడాది బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఈ జంట సడన్గా అభిమానులకు షాక్ ఇస్తూ విడిపోయారు అని.. పైగా ఇద్దరూ పరస్పర నిర్ణయంతోనే విడిపోయినట్లు సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ ఇప్పుడు ఈ జంట విడిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి

ఆ జంట ఎవరో కాదు టాక్సిక్ సినిమాతో ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన తారా సుతారియా (Tara sutharia). ఆమె బాయ్ ఫ్రెండ్ వీర్ పహారియా (Veer Pahariya). దీపావళి సందర్భంగా తారా.. వీర్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.m సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ అంటూ అధికారికంగా కన్ఫామ్ చేసింది. గణేష్ చతుర్థి సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇద్దరూ కూడా పంచుకున్నారు. పైగా గత కొన్ని నెలలుగా ఫ్యాషన్ షోలలో కూడా కలసి షో స్టాపర్లుగా ర్యాంపు పై నడిచి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అదే ఏడాది డేటింగ్ కూడా మొదలుపెట్టిన వీరు.. తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు కొన్ని నెలల్లోనే ఇద్దరు విడిపోతున్నట్లు వార్తలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇద్దరి మధ్య బంధం బలంగా ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఏపీ థిల్లాన్ ముంబై కచేరిలో తారా అతనితో స్టేజ్ పై సరదాగా గడిపిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో వీర్ అసౌకర్యంగా ఫీల్ అయినట్లు కూడా వార్తలు వినిపించాయి.

పుకార్లపై తారా సుతారియా రియాక్షన్

ఇక ఈ వార్తలపై తారా ఇంస్టాగ్రామ్ లో స్పందిస్తూ.. “ఇవన్నీ తప్పుడు కథనాలు” అంటూ కొట్టి పారేసింది. అంతేకాదు వీర్ కూడా ఈ వీడియోలో ఉన్నాడు అని, కానీ ఎవరో ఎడిట్ చేసి ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారు అంటూ ఆమె మండిపడింది.

అసలు వీడియోలో నిజమెంత?

ఇకపోతే అసలైన వీడియోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓర్రీ షేర్ చేస్తూ ఇందులో ఇద్దరు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ వీడియోని వీర్ కూడా రీపోస్ట్ చేస్తూ..” నిజం ఎప్పుడూ గెలుస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికైతే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్తలు రాగా వీర్ వాటికి చెక్ పెట్టారు.

BIG TV తెలుగు వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి Tags tara sutaria Toxic Movie Share

మొత్తానికి తారా, వీర్ బ్రేకప్ వార్తలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై వారి స్పందనతో కొంత స్పష్టత వచ్చినప్పటికీ, అభిమానుల్లో మాత్రం ఇంకా సందిగ్ధత నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.