|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీనా కుమారి?

Published: 23-06-2025, 2:44 PM
మీనా కుమారి?

ప్రముఖ బాలీవుడ్ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా ‘కమల్‌ ఔర్‌ మీనా’ అనే సినిమా తెరకెక్కనుంది. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో కియారా అద్వానీ నటించే అవకాశం ఉంది.

Key Points

1

ప్రముఖ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా ‘కమల్‌ ఔర్‌ మీనా’ సినిమా నిర్మాణం.

2

కియారా అద్వానీ మీనాకుమారి పాత్రలో నటించే అవకాశం.

4

సిద్ధార్థ్‌ పి. మల్హోత్రా దర్శకత్వం, సరెగమా సంస్థ నిర్మాణం.

‘కమల్‌ ఔర్‌ మీనా’ సినిమా ప్రకటన

దివంగత ప్రముఖ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్‌ ఔర్‌ మీనా’ అనే సినిమా తెరకెక్కనుంది. ‘హిచ్‌ కీ, మహారాజ్‌’ వంటి చిత్రాల ఫేమ్‌ సిద్ధార్థ్‌ పి. మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమాలోని మీనాకుమారి పాత్ర కోసం కృతీసనన్, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సిద్ధార్థ్‌ పి. మల్హోత్రా ఇటీవల ఈ సినిమా కథని కియారా అద్వానీకి వినిపించగా, ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని బాలీవుడ్‌ సమాచారం. నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో వివాహ బంధంలో అడుగుపెట్టిన కియారా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు.

ఆమె ప్రసవం, కొంత విశ్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలన్నది మేకర్స్‌ ప్లాన్‌. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మీనాకుమారిలా కనిపించాలనుకోవడం కియారాకు పెద్ద సవాల్‌ అని, అయినప్పటికీ కథ నచ్చి ఒప్పుకున్నారని బాలీవుడ్‌ టాక్‌. ట్రాజెడీ క్వీన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా చెప్పుకునే మీనా కుమారిగా కియారా నటిస్తే, ఈ సినిమాలోని దర్శకుడు కమల్‌ అమ్రోహి పాత్రను ఎవరు పోషించనున్నారనే చర్చకూడా జరుగుతోంది. సిద్ధార్థ్‌ పి. మల్హోతా, అమ్రోహి ఫ్యామిలీ, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.

కియారా అద్వానీ నటన అవకాశం

చిత్రీకరణ ప్రణాళికలు

చివరగా, ‘కమల్‌ ఔర్‌ మీనా’ సినిమా మీనాకుమారి జీవితంపై ఆసక్తికరమైన చిత్రంగా ఉంటుందని ఆశిద్దాం. కియారా అద్వానీ నటనతో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.