
📌 Key Points
- మీనాక్షి చౌదరి వరుస విజయాలతో టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది.
- ఈమె నటించిన ‘అనగనగా ఒక రాజు’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.
- కన్నడలో రక్షిత్ శెట్టి సినిమాలో మీనాక్షి హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.
- ‘777 చార్లీ’ సినిమా 100 కోట్లు వసూలు చేసింది, రక్షిత్ శెట్టితో మీనాక్షి నటించే అవకాశం ఉంది.
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరికి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో కలిసి నటించే అవకాశం ఆమెకు వచ్చిందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో మీనాక్షి హవా
Meenaaksh Chaudary : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు మీనాక్షి చౌదరి.. ఈమధ్య ఈమె బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.. ఈ ముద్దుగుమ్మ నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో జనాలు మీనాక్షి చౌదరి తో సినిమాలు చేసేందుకు వరుసగా క్యూ కలుస్తున్నారు. తెలుగులో ఒక్కో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది.. గత ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ తో బిగ్గెస్ట్ నో తన ఖాతాలు వేసుకుంది. ఇక రీసెంట్ గా ఈమె నటించిన అనగనగా ఒక రాజు మూవీ కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దాంతో ఈమెకు వరుసగా సినిమాలో వచ్చి పడుతున్నాయి.. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
చిన్న సినిమాతో నటిగా ప్రయాణం మొదలు పెట్టిన అమ్మడు అనతి కాలంలో స్టార్ హీరోలకు చాయిస్ గా మారింది. ఇటీవలే విడుదలైన `అనగనగా ఒక రాజు`తోనూ మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా విమర్శకుల ప్రశంస లందుకుంది. ఈ మూవీతో మంచి పేరు అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఈమె సినిమాలు మాత్రం పెద్దగా లేవని తెలుస్తుంది. ఏ హీరోయిన్ కైనా అకౌంట్ లో హిట్ సినిమాలు పడుతుంటే ఆమె చేతిలో అరడజకు పైగా సినిమాలు ఉంటాయి.. కానీ మీనమ్మ పరిస్థితి మాత్రం అలా లేదు. చేతిలో ఒకటి రెండు సినిమాలు తప్ప.. వెరే సినిమాలేవి లేనట్లే కనిపిస్తుంది. ఇదిలా ఉండదా తాజాగా ఓ కన్నడ చిత్రంలో ఈమె నటించే అవకాశం అందుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కి రాబోతున్న సినిమాలో ఈమె హీరోయిన్గా నటించబోతుంది అంటూ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టనున్న మీనాక్షి?
రక్షిత్ శెట్టితో 100 కోట్ల సినిమా?
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన బిగ్గెస్ట్ హెడ్ చిత్రం `777చార్లీ`.. చిన్న స్టోరీ తో వచ్చిన ఈ మూవీ.. అసలు ఊహించిన విధంగా 100 కోట్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే రక్షిత్ తో మరోప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా తొలుత కన్నడ నటినే తీసుకో వాలనుకున్నారు.. మీనాక్షి చౌదరి అపాత్రకు కరెక్ట్ గా సూట్ అవ్వడంతో ఆమెను ఫిక్స్ చేసినట్లు వార్తా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మీనాక్షికి సరైన సమయంలో వస్తోన్న అవకాశం ఇది. ఇప్పటికే తెలుగు సహా తమిళ్ లో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం చేతిలో ఉంది `వృషకర్మ` ఒక్కటే. ఇందులో యువ సామ్రాట్ నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు మరో రెండు సినిమాలకు సైన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె సినిమాల గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
మొత్తానికి మీనాక్షి చౌదరి కెరీర్ ప్రస్తుతం ఊపందుకుంది. టాలీవుడ్ లోనే కాకుండా కన్నడలో కూడా ఆమె తన సత్తా చాటుతుందో లేదో చూడాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

