
📌 Key Points
- చిరంజీవి 158వ సినిమాలో ‘దురంధర్’ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్‌గా నటించే అవకాశం.
- ఈ చిత్రంలో బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ విలన్‌గా కనిపించే అవకాశం ఉంది.
- మెగాస్టార్ గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీతో కలిసి పనిచేస్తున్నారు.
- తండ్రీ కూతుర్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో మెగా 158 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ నటించనుందని సమాచారం. అలాగే బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించే అవకాశం ఉంది.
మెగా 158లో హీరోయిన్ ఎవరు?
Mega 158: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో సినిమాలో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో మెగా 158 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ గురించి ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో దురంధర్ సినిమాలో నటించిన ఓ ముద్దుగుమ్మ నటించబోతుందని తెలుస్తుంది.. అలాగే ఇందులో విలన్ పాత్రలో ఓ స్టార్ నటుడు నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఎవరూ? ఇందులో మెయిన్ లీడ్ లో ఎవరు నటిస్తున్నారన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ తో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా గురించి ఇటీవలే ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఈ మూవీ కాస్టింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో హీరోయిన్ గా దురంధర్ మూవీలో నటించిన సారా అర్జున్ నటించబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఈ ముద్దుగుమ్మ నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పుడు చిరంజీవి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ మూవీ మొత్తం తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ తో రాబోతున్న నేపథ్యంలో చిరంజీవి కూతురు పాత్రలో కనిపించునుంది.. ఈ మూవీతో ఈమె క్రేజ్ ఏ మాత్రం పెరుగుతుందో చూడాలి..
విలన్ పాత్రలో బాలీవుడ్ నిర్మాత?
తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ కథనం!
చిరంజీవి సినిమాలో నటించేందుకు స్టార్స్ ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం స్టార్ హీరోలు పోటీపడుతున్నారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీలో వెంకటేష్ నటించారు. అలాగే ఈ మూవీలో విలన్ పాత్రలో బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ క్యారెక్టర్ గురించి ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ రాలేదు. ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఇందులో ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారని తెలుస్తోంది. ఆయన ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారని టాక్.. చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..
చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సారా అర్జున్ హీరోయిన్‌గా, అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.


