
📌 Key Points
- చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ సినిమా.
- సంక్రాంతి 2027 విడుదల వాయిదా పడిన ‘మెగా 158’.
- చిత్ర నిర్మాతలు ఇతర సినిమాలతో బిజీగా ఉండటమే కారణం.
- వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న చిత్ర బృందం.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో వస్తున్న ‘మెగా 158’ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. కొన్ని కారణాల వల్ల సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెగా 158 సంక్రాంతి రేసు నుంచి ఎందుకు తప్పుకుంది?
Mega 158: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదలై సుమారు 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వచ్చేయడాది సంక్రాంతికి ఇప్పుడే కర్చీఫ్ వేసి పెట్టారు. ప్రస్తుతం చిరంజీవి (chiranjeevi) బాబి(Bobby) డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగా 158 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను ప్రారంభించాల్సి ఉంది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ పనులు గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరిలోనే పూజ కార్యక్రమాలను జరుపుకుంటుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా మాత్రం మరింత ఆలస్యం అవుతుంది. గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించి ఉంటే 2027 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని విడుదల చేసే దిశగా చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు కానీ ఈ సినిమా నిర్మాతలు కెవిఎన్ ప్రొడక్షన్స్ వారు ఇతర సినిమాల వల్ల బిజీగా ఉన్నారు అలాగే కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై జననాయగన్ సినిమా విడుదల ఆగిపోవడంతో చిత్ర నిర్మాతలు మెగా 158 సినిమాలు మరింత ఆలస్యం చేయబోతున్నారని తెలుస్తోంది.
సినిమా ఆలస్యానికి కారణాలు ఏమిటి?
ఈ సినిమా అనుకున్న విధంగానే ఫిబ్రవరిలో పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని షూటింగ్ పనులను ప్రారంభించి ఉంటే 2027 సంక్రాంతికి విడుదల అయ్యేది కానీ ఈ సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నారని సమాచారం. ఈ సినిమాని 2027 వేసవిలో వచ్చేలాగా చిత్ర బృందం ప్రణాళికలను రక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటీ నటుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని సమాచారం.
కొత్త విడుదల తేదీ ఎప్పుడు ఉండవచ్చు?
ఇందులో ప్రియమణి హీరోయిన్ గా నటించగా చిరంజీవి కూతురి పాత్రలో అనస్వర రాజన్ కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోల్ కత్తా గ్యాంగ్ స్టర్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇండస్ట్రీ సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి కానీ సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఇదివరకు చిరంజీవి బాబీ కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి మెగా 158 సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏంటి అనే విషయాల పై స్పష్టత రావాల్సి ఉంది
‘మెగా 158’ సినిమా సంక్రాంతికి రావడం లేదనే వార్త అభిమానులను నిరాశకు గురిచేసింది. వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం వేచి చూడాల్సిందే.


