
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా 158 చిత్రం.
- జననాయగన్ సినిమా నిర్మాతల సమస్యల కారణంగా మెగా 158 పూజ వాయిదా.
- పవన్ కళ్యాణ్ ను పూజ కార్యక్రమానికి ఆహ్వానించిన బాబి.
- సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ సినిమాగా రానుంది, ప్రియమణి హీరోయిన్ గా నటించే అవకాశం.
మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబినేషన్లో వస్తున్న మెగా 158 చిత్రం పూజ కార్యక్రమం వాయిదా పడింది. జననాయగన్ సినిమా నిర్మాణ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానించారు.
మెగా 158 పూజ వాయిదాకు కారణం?
Mega 158: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో తదుపరి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాను ప్రకటించారు. నిజానికి ఈ సినిమా ఇదివరకే పూజా కార్యక్రమాలను ప్రారంభించుకొని రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోవాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) మోకాలికి సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. కొంత విశ్రాంతి అవసరం కావడంతో ఈ సినిమాని పక్కన పెట్టారు.
ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ పూజా కార్యక్రమాలను జరుపుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలపై ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేకపోయిన ఈ సినిమా ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలను జరుపుకోబోతుందని ఏప్రిల్ 20 తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు అన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పూజ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి అంటూ బయటకు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం
ఈ సినిమా పూజా కార్యక్రమాలు వాయిదా పడటానికి కారణం లేకపోలేదు మెగాస్టార్ చిరంజీవి బాబి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు కెవిఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక హీరో విజయ్(Vijay) నటించిన జననాయగన్ (Jananayagan)సినిమా నిర్మాతలు కూడా కెవిఎన్ ప్రొడక్షన్స్ కావడంతో ఈ సినిమా పూజా కార్యక్రమాలు వాయిదా పడ్డాయని తెలుస్తుంది. లీక్ సమస్య కారణంగా, ప్రొడక్షన్ హౌస్ దీనిని తాత్కాలికంగా వాయిదా వేసింది. మరి ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎప్పుడు ప్రారంభించబోతోందనే వివరాలు తెలియాల్సి ఉన్నాయి. మెగా 158 పూజా కార్యక్రమాల కోసం బాబి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ పూజా కార్యక్రమాలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా లాంచ్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా చివరి నిమిషంలో వాయిదా పడిందని తెలిసిన మెగా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
మెగా 158 సినిమాకు ఇప్పుడప్పుడే మోక్షం లేదా, తరచూ వాయిదా పడుతూ వస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి జోడిగా ప్రియమణి నటించబోతున్నట్టు సమాచారం. చిరంజీవి కూతురు పాత్రలో అనస్వర రాజన్ నటిస్తున్నారని ఇందులో మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ సినిమా
మెగా 158 సినిమా పూజ వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. త్వరలో ఈ సినిమా పూజ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.


