
సినీతారలు తమ లగ్జరీ వస్తువులతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కోలీవుడ్ బ్యూటీ మృణాళిని రవి మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUV కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. దక్షిణాదిలో ఈ కారును సొంతం చేసుకున్న తొలి నటిగా ఆమె నిలిచారు. దీని ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.
Key Points
మృణాళిని రవి కొత్త మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేసింది.
దక్షిణాది నటీమణులలో ఈ కారును సొంతం చేసుకున్న మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించింది.
మహింద్రా BE6 కారు సుమారు రూ. 28 లక్షల ధర ఉంటుందని అంచనా.
వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో మృణాళిని రవి మంచి గుర్తింపు పొందింది.
మృణాళిని రవికి లగ్జరీ కారుపై మోజు
సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు చాలా మంది తమ లగ్జరీ వస్తువుల వల్లే ఒక్కోసారి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంటుటారు. సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ తమ రేంజ్‌కు తగ్గట్లుగా ఉంటారు. అందులో కోలీవుడ్ బ్యూటీ మృణాళిని రవి(Mrinalini Ravi) కూడా ఒకరు. ‘సూపర్ డీలక్స్’ ద్వారా వచ్చి వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో హిట్ అందుకుని ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. ఇక పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. గత కొద్ది రోజులనుంచి అవకాశాలు లేక కాళీగా ఉంటుంది. ఇటీవల ‘డూప్లికేట్’ (Duplicate)మూవీలో హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాళిని రవి లగ్జరీ కారు కొన్నది.
మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUV ప్రత్యేకతలు
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలపడంతో అంతా దాని రేట్ గురించి సెర్చ్ చేయడం మొదలెట్టేశారు. తాజా సమాచారం ప్రకారం.. లేటెస్ట్‌గా మార్కెట్‌లోకి వచ్చిన మహింద్రా BE6 ఎలక్ట్రిక్ SUV లగ్జరీ కానును సొంతం చేసుకుంది. ఈ కార్లను ఆగస్టులో లాంచ్ చేయగా.. ఆ కారు మోడల్‌ను దక్కించుకున్న మొదటి వ్యక్తిగా మృణాళిని రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ కారుకు రూ. 28లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ BE6 మోడల్ కారును ఇప్పటికే స్టార్ క్రికేటర్లు, బాలీవుడ్ నటుడు సొంతం చేసుకోగా.. దక్షిణాది నటుల్లో ఈ కారు సొంతం చేసుకున్న తొలి నటి మృణాళిని మాత్రమే అని తెలుస్తోంది.
సౌత్ ఇండియాలో తొలి రికార్డు సృష్టించిన మృణాళిని
A post shared by Mirnalini Ravi (@mirnaliniravi)
మృణాళిని రవి మహీంద్రా BE6 ఎలక్ట్రిక్ SUVని సొంతం చేసుకోవడం ద్వారా దక్షిణాదిలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ లగ్జరీ కారు ఆమె సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది. అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.


