
మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లాక్ శారీలో ఆమె అందం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోలకు సాయి ధరమ్ తేజ్ లైక్ చేయడం గమనార్హం.
Key Points
నిహారిక కొణిదెల బ్లాక్ శారీలో అద్భుతంగా కనిపించింది.
ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సాయి ధరమ్ తేజ్ నిహారిక ఫోటోలకు లైక్ చేశాడు.
నెటిజన్లు సాయి ధరమ్ తేజ్ ప్రేమను వ్యక్తం చేశారని అనుకుంటున్నారు.
నిహారిక కొణిదెల సోషల్ మీడియా పోస్ట్
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా పలు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. అంతగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తోంది. అలా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ అనే బ్యానర్ స్థాపించి ఓవైపు వెబ్ సిరీసులు, మరోవైపు సినిమాలు నిర్మిస్తోంది. తన నిర్మాణంలో గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు లేటెస్టుగా నిహారిక తన సొంత ప్రొడక్షన్‌లో మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టింది. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించిన సంగీత్ శోభన్(Sangeeth Sobhan) హీరోగా నిహారిక కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు.
వైరల్ అయిన ఫోటోలు
ఇదిలా ఉంటే ఓ పక్క నిర్మాతగా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గానే ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్టులతో అభిమానులకు దగ్గరవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నిహారిక బ్లాక్ శారీలో ఉన్న ఫొటోస్‌ను షేర్ చేసింది. అలాగే చీరలో స్టన్నింగ్ ఫొటోలకు పొజులిచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ పోస్టును హీరో సాయి ధరమ్ తేజ్ కూడా లైక్ చేశాడు. దీంతో నెటిజన్లు నీ మనసులో ఉన్న ప్రేమను ఇలా లైక్ రూపంలో చూపించావా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ రియాక్షన్
A post shared by Niharika Konidela (@niharikakonidela)
నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. సాయి ధరమ్ తేజ్ ప్రతిస్పందన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.


