
📌 Key Points
- మైత్రి మూవీస్ సీఈఓ చెర్రీ RC17 రెగ్యులర్ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు.
- జూన్ నెల నుండి రామ్ చరణ్ RC17 షూటింగ్‌లో పాల్గొననున్నారు.
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలైన వెంటనే RC17 పనుల్లో బిజీ కానున్నారు.
- రంగస్థలం తర్వాత సుకుమార్-రామ్ చరణ్ కాంబోపై భారీ అంచనాలున్నాయి.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC17 సినిమాపై అభిమానుల నిరీక్షణకు తెరపడింది. మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది.
RC17పై మైత్రి నిర్మాత క్లారిటీ
RC 17Film: మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా(Peddi Movie) పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చివరి దశ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాంచరణ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ తన 17వ సినిమాని పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించి ఏడాది అవుతోంది ఇప్పటివరకు షూటింగ్ పనులను మాత్రం జరుపుకోలేదు. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్ట్ పనులు అన్నీ కూడా పూర్తి చేశారని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది.
ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభం కానున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా కానీ చిత్ర నిర్మాతల నుంచి ఏ మాత్రం అప్డేట్ లేకపోవడంతో చరణ్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మైత్రి మూవీ బ్యానర్ సీఈఓ చెర్రీ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ కీలక అప్డేట్ తెలియజేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి అయ్యాయని జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నట్టు చెర్రీ తెలిపారు.
జూన్ నుండి షూటింగ్ ప్రారంభం
ఈ విధంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జూన్ నుంచి ప్రారంభం కాబోతున్నాయనే విషయం తెలిసిన మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈయన నటిస్తున్న పెద్ది సినిమా కూడా జూన్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా పెద్ది సినిమా విడుదల పూర్తి కాగానే రామ్ చరణ్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సుకుమార్ డైరెక్షన్లో బిజీ కానున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారకంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు హీరోయిన్ కి సంబంధించిన వివరాలను కూడా చిత్ర బృందం ఎక్కడ వెల్లడించలేదు.
రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ఇదివరకే రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ జోడిగా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని తెలుస్తుంది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో సుకుమార్ రామ్ చరణ్ చేయబోయే సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది?. ఇందులో హీరోయిన్, ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రంగస్థలం తర్వాత మరో మ్యాజిక్?
మొత్తంగా, RC17 సినిమాపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. జూన్ నుండి షూటింగ్ ప్రారంభం కావడం, రామ్ చరణ్-సుకుమార్ కాంబో మ్యాజిక్ మరోసారి చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.


