|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ కోసం అఖిల్ త్యాగం? టాలీవుడ్‌లో సంచలన నిర్ణయం! బాక్సాఫీస్ వార్ తప్పదా?

Published: 30-01-2026, 11:35 AM
రామ్ చరణ్ కోసం అఖిల్ త్యాగం? టాలీవుడ్‌లో సంచలన నిర్ణయం! బాక్సాఫీస్ వార్ తప్పదా?
  • రామ్ చరణ్ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉంది.
  • అఖిల్ అక్కినేని సినిమా ‘లెనిన్’ విడుదల తేదీ మే 1గా నిర్ణయించబడింది.
  • రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల అయితే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
  • అఖిల్ కెరీర్‌కు ‘లెనిన్’ సినిమా విజయం చాలా కీలకం.

మెగా హీరో రామ్ చరణ్ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉంది. అఖిల్ అక్కినేని తన ‘లెనిన్’ సినిమాను మే 1న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకే రోజు రెండు సినిమాలు విడుదల అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొనే అవకాశం ఉంది.

రామ్ చరణ్ సినిమా విడుదల వాయిదా?

Mega Hero vs Akkineni Hero: పెద్ది సినిమా విడుదల తేదీ ప్రస్తుతం అందరిని పెద్ద సంక్షోభంలో పడేస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మార్చి 27న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ తేదీకి రిలీజ్ కష్టమని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమవుతున్నట్లు కనిపిస్తోంది.

సమాచారం ప్రకారం..పెద్ది.. సినిమా మార్చి 27కి రావడం దాదాపు అసాధ్యమనే స్థాయికి చేరింది. దీంతో నిర్మాతలు కొత్త విడుదల తేదీ కోసం ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మే 1ను సరైన తేదీగా భావిస్తున్నారట. అప్పటికి షూటింగ్ పూర్తవుతుందని..ప్రమోషన్లకు కూడా సరైన సమయం దొరుకుతుందని టీమ్ భావిస్తోంది.

కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే మే 1 తేదీని ఇప్పటికే అఖిల్ అక్కినేని తన కొత్త సినిమా లెనిన్ కోసం లాక్ చేసుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చాలా ముందే ప్రకటించారు. అంతేకాదు.. ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి. అఖిల్ కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకం. ఏజెంట్ సినిమా భారీ ఫ్లాప్ తర్వాత..అఖిల్ చాలా ఆశలతో ఈ ప్రాజెక్ట్ చేశాడు. లెనిన్ తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.

మే 1న అఖిల్ ‘లెనిన్’ విడుదల

ఇప్పుడు ఒకవేళ ‘పెద్ది’ కూడా మే 1నే రిలీజ్ చేయాలని అనుకుంటే, రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద తలపడే పరిస్థితి వస్తుంది. ఇది ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా రామ్ చరణ్.. అఖిల్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో, ఇద్దరూ ఒకే రోజు తమ సినిమాలు విడుదల చేయాలనుకోరు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అలా కాదు అని అది మంచి తారీకు అని అఖిల్ విడుదల చేస్తే మాత్రం.. తప్పకుండా రామ్ చరణ్ సినిమా వల్ల అఖిల్ సినిమా పై ఎక్కువ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. దాంతో సినిమాకి మంచి టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ రాకపోవచ్చు. ఈ సినిమా కూడా కలెక్షన్స్ తెచ్చుకోకపోతే ఇక అఖిల్ కెరియర్ తప్పకుండా అగమ్య గోచారం కావడం ఖాయం.

ఈ పరిస్థితిలో అఖిల్ తన సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తారా? లేక రామ్ చరణ్ టీమ్ మరో తేదీకి మారుతుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద ప్రశ్నగా మారింది. ‘లెనిన్’ టీమ్ ఇప్పటికే మే 1ని లక్ష్యంగా పెట్టుకుని చాలా పని చేసింది కాబట్టి, తేదీ మార్చడం అంత సులువు కాదు. మరోవైపు ‘పెద్ది’కి కూడా సరైన పండుగ సీజన్ అవసరం.

బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదా?

చివరికి ఎవరు ఎవరికో తగ్గుతారు.. ఏ ప్రొడక్షన్ హౌస్ మరోదాన్ని ఒప్పిస్తుంది అన్నదానిపైనే ఈ వ్యవహారం ఆధారపడి ఉంది. మే 1 తేదీ ఒక్కసారిగా చాలా ప్రాముఖ్యత పొందడంతో, ఈ రిలీజ్ డేట్ రేస్ ఎలా ముగుస్తుందో చూడాలి. టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం తుది నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చివరికి ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి. ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయితే, అఖిల్ కెరీర్‌పై దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.