|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా లేడీస్ అంతా ఒకే ఫ్రేములో.. వైరల్ అవుతున్న అరుదైన దృశ్యం!

Published: 31-03-2026, 8:35 AM
మెగా లేడీస్ అంతా ఒకే ఫ్రేములో.. వైరల్ అవుతున్న అరుదైన దృశ్యం!
  • మెగా ఫ్యామిలీ లేడీస్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందం.
  • పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
  • చిరంజీవి తల్లి, భార్య, నాగబాబు భార్య, పవన్ కళ్యాణ్ భార్య మరియు చిరంజీవి చెల్లెలు ఫోటోలో ఉన్నారు.
  • మెగా లేడీస్ పవర్ ప్యాక్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల మెగా ఫ్యామిలీ లేడీస్ అందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

ఒకే ఫ్రేమ్‌లో మెగా లేడీస్ సందడి

Mega Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి హీరోలుగా నిర్మాతలు అడుగుపెట్టి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మెగా హీరోలు నిర్మాతలు ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే మెగా హీరోలు అంతా ఓకే ఫ్రేమ్ లో కనబడితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తూ ఉంటారు.

ఇప్పటివరకు మెగా హీరోలందరినీ ఒకే ఫ్రేమ్ లో చూసాము కానీ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ ఎక్కడ ఒకే చోట కలిసి కనిపించిన సందర్భాలు లేవు. అయితే తాజాగా ఇలాంటి ఫోటోని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవితో పాటు ఆయన భార్య సురేఖ నాగబాబు భార్య పద్మజ, పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నాతో పాటు చిరంజీవి ఇద్దరు చెల్లెలు కూడా ఉండటం విశేషం.

మెగా లేడీస్ పవర్ ప్యాక్..

అభిమానుల ఆనందానికి అవధులు లేవు

ఇలా మెగా కోడళ్ళతో పాటు ఆడపడుచులందరూ కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను వైరల్ చేస్తూ మెగా లేడీస్ పవర్ ప్యాక్ అంటూ ఈ ఫోటోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలా అందరిని చాలా రోజుల తర్వాత ఓకే చోట చూడటంతో అభిమానులకు కన్నుల పండుగగా ఉందని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా మెగా కుటుంబం ఎంతో ఉన్నతంగా రాణిస్తుంది అయితే ఇలా మెగా హీరోల విజయం వెనుక మెగా లేడీస్ పవర్ ఉందనే చెప్పాలి.

వైరల్ అవుతున్న అన్నా కొణిదెల ఫోటో

ఇలా మెగా కుటుంబం మొత్తం ఓకే తాటిపై ఉండటం కోసం చిరంజీవి ఎంతగా అయితే కృషి చేశారో అంతకు రెట్టింపుగా ఆయన సతీమణి సురేఖ కృషి చేశారని చెప్పాలి. చిరంజీవి సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో సురేఖ తన పిల్లలతో పాటు పవన్ కళ్యాణ్ నాగబాబులను కూడా ఎంతో బాధ్యత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటూ వారందరిని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఇలా మెగా కుటుంబంలో ఉన్న అనురాగం, ఆప్యాయత, ఐకమత్యం ఎందరికో ఆదర్శంగా ఉంటుందని చెప్పాలి. ఇటీవల ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన అన్నా కొణిదెల ఇలా తన ఫ్యామిలీకి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

మొత్తానికి మెగా కుటుంబం ఐకమత్యంగా ఉండటం ఎందరికో ఆదర్శం. అన్నా కొణిదెల తన ఫ్యామిలీకి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.