|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా మాస్ ట్రీట్: చిరు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్! ఫ్యాన్స్ కి పండగే!

Published: 10-01-2026, 12:35 AM
మెగా మాస్ ట్రీట్: చిరు 'మన శంకర వరప్రసాద్ గారు' కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్! ఫ్యాన్స్ కి పండగే!
  • జనవరి 12న మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ గ్రాండ్ రిలీజ్! మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి
  • చిరంజీవి స్వాగ్ లుక్‌తో విడుదలైన కౌంట్ డౌన్ పోస్టర్.. సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్!
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు.. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్!
  • నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో అదరగొట్టే నటనతో మెగా మూవీ!

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది.

వైరల్ అవుతున్న చిరు స్వాగ్ లుక్!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu) సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.

సంక్రాంతికి మెగాస్టార్ సందడి

అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘మన శంకర వరప్రసాద్’ రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్‌ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే ఇంకా ఈ చిత్రం రిలీజ్ కావడానికి రెండు రోజులే ఉన్నది. దీంతో తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీటీమ్ ఎక్స్ వేదికగా కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

అనిల్ రావిపూడి మ్యాజిక్!

‘పెద్ద స్క్రీన్లపై మనశంకరవరప్రసాద్ గారు మెగా స్వాగ్‌ని చూడటానికి మరియు జరుపుకోవడానికి 2 రోజులు మాత్రమే ఉంది.. బుకింగ్స్ ఈరోజు నుండి ప్రారంభమవుతాయి.. జనవరి 12, 2026న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మనశంకర వరప్రసాద్ గారు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో చిరు స్వాగ్ లుక్‌లో ఖతర్నాక్ అనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మెగాస్టార్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.