|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ షాకింగ్ సీక్రెట్! గూండా సినిమా వెనుక నాన్న వార్నింగ్.. చిరంజీవి సంచలన నిజాలు!

Published: 23-06-2026, 11:56 PM
మెగాస్టార్ షాకింగ్ సీక్రెట్! గూండా సినిమా వెనుక నాన్న వార్నింగ్.. చిరంజీవి సంచలన నిజాలు!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్‌లో కంటికి గాయం.. 8 కుట్లు పడ్డాయని చిరు భావోద్వేగం.
  • చిరంజీవి ‘గూండా’ సినిమా కోసం ట్రైన్ కింద యాక్షన్.. తండ్రి షాకింగ్ రియాక్షన్.
  • మెగాస్టార్ తండ్రి ఇచ్చిన ‘వార్నింగ్’ వెనుక అసలు కథ బయటపెట్టిన చిరంజీవి.
  • ‘పెద్ది’లో చరణ్ నటనకు ఫిదా అయిన మెగాస్టార్.. రంగస్థలం తర్వాత మరో మైలురాయి.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ షాకింగ్ సంఘటనను తాజాగా బయటపెట్టారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కోసం పడిన కష్టాన్ని చూసి, తన తండ్రి ఇచ్చిన విలువైన వార్నింగ్‌ను గుర్తుచేసుకున్నారు. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది!

రామ్ చరణ్ డెడికేషన్ చూసి మెగాస్టార్ ఎమోషనల్!

రీసెంట్ గా పెద్ది సక్సెస్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. తన వారసుడిగా రామ్ చరణ్ సాధించిన ఘనతను తలుచుకుని ఉప్పొంగిపోయాడు. అదే సమయంలో సినిమా కోసం రామ్ చరణ్ పడుతున్న కష్టాన్ని అభినందిస్తూనే.. చరణ్ కు జరిగిన ప్రమాదాలను తలుచుకుని బాధపడ్డారు. తండ్రిగా తాన ఫీలింగ్ ఏంటో వెల్లడించారు. ఈక్రమంలో తాన కెరీర్ బిగినింగ్ లో తన తండ్రి ఎలా ఫీలయ్యారో.. ఏమని కామెంట్ చేశారో గుర్తు చేశారు చిరంజీవి. పెద్ది ఈవెంట్ తో తన తండ్రిని తలుచుకుని మెగాస్టార్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి మాట్లాడుతూ.. ” తోటి నటుడిగా, పరిశ్రమలో సీనియర్‌ యాక్టర్ గా చెప్పాలంటే… రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్, ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్‌మెంట్… ఒక నటుడికి అవసరమైన అన్ని కోణాల్లో పరిపక్వత సాధించి, దానిని 100 శాతం చరణ్ తెరపై చూపించాడు.

రంగస్థలంలో చరణ్ ఎంత అద్భుతంగా నటించాడో అందరికి తెలుసు.. మళ్లీ అలాంటి పాత్ర ఎప్పుడొస్తుందా అని అనుకున్నా.. కానీ మూడేళ్లలోనే.. పెద్దిలాంటి మరో గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పాత్ర దక్కడం నిజంగా చరణ్ అదృష్టం.సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు… పెద్ది మాత్రమే కనిపించాడు. ఆ పాత్రను పూర్తిగా ఒంటబట్టించుకున్నాడు.

పెద్ది పాత్రతో మనందరినీ నవ్వించాడు, ఏడిపించాడు, ఉత్సాహపరిచాడు, భావోద్వేగానికి గురిచేశాడు. కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగాడు. అదే పరిపూర్ణ నటన. ఈరోజు రామ్ చరణ్ ఆ పరిపక్వతను, ఆ సంపూర్ణతను చూపించి నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాడు. చివరిగా విజయం సాధించాడు. ఆ పాత్రలో అతను చూపించిన నటనకు నా హృదయపూర్వక అభినందనలు.. అని చిరంజీవి అన్నారు.

గూండా సినిమా టైమ్‌లో చిరు తండ్రి వార్నింగ్ కథ!

చిరంజీవి మాట్లాడుతూ.. ” షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. ఆ ఫొటో చూసి నేను చాలా భయపడ్డాను. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. ఎనిమిది కుట్లు పడ్డాయి. అయినా సరే చరణ్ వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది.

చరణ్ ని చూస్తే.. నాకు గూండా సినిమా షూటింగ్ గుర్తొచ్చింది. ఆ షూటింగ్ లో నేను ట్రైన్ కింద పడుకుని యాక్షన్ సీన్ చేయల్సి వచ్చింది. అప్పుడే షూటింగ్ కు మా నాన్నగారు వచ్చారు. అప్పుడు సురేఖ ప్రెగ్నెంట్… ఆ సీన్ షూటింగ్ చూసి మా నాన్నగారు చాలా భయపడ్డారు. ఎందుకు ఈ రిస్క్ లు అని అడిగారు. నేను ‘ప్రేక్షకులను అలరించాలంటే ఇలాంటి రిస్కులు చేయాల్సిందే’ అన్నాను.

అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు – ‘నీకు కొడుకు పుట్టి, వాడు హీరో అయి ఇలాంటి కష్టాలు పడితే అప్పుడు ఒక తండ్రి బాధ తెలుస్తుంది’ అని. చరణ్ కి గాయమైనప్పుడు నాన్నగారి మాట గుర్తుకు వచ్చింది. అయితే తను కష్టాన్ని నమ్ముకోవడం తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది..” అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

‘పెద్ది’తో చరణ్ కొత్త రికార్డులు.. తండ్రి ప్రశంసలు!

షార్ట్ కట్ లో సక్సెస్ కోసం మేం ఎప్పుడు చూడలేదన్నారు చిరంజీవి. ఏ స్థాయిలో ఉన్నా.. కష్టాన్నే నమ్ముకుంటామని క్లారిటీఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ..” చరణ్ ఒక స్టార్ హీరో కొడుకు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దర్శకుడు చెప్పింది చేసి వెళ్లిపోవచ్చు. కానీ అతను అలా చేయలేదు. కష్టాన్ని నమ్ముకున్నాడు. అందుకే ఈరోజు మీరంతా అతని నటనను నేషనల్ అవార్డు స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. అవార్డు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రజల మనసుల్లో ‘అద్భుతంగా నటించాడు’ అనే గుర్తింపు రావడం కంటే గొప్ప అవార్డు మరొకటి లేదు. ప్రజల ప్రేమ, అభిమానం, ఆదరణే గొప్ప అవార్డు.

ఈ సినిమా కోసం అతను చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నేను ప్రతిరోజూ ఇంట్లో చూశాను. ఉదయం వ్యాయామాలు, షూటింగ్, మళ్లీ సాయంత్రం వ్యాయామాలు… అతని కష్టాన్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించేది. ఇలాగే కష్టపడతాం.. ఒళ్లు వచ్చి పనిచేస్తాం.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఆడియన్స ను అభిమానులను అలరించడానికే మా ప్రయత్నం అని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. ఎన్నో అవమానాలు, ఎదురు దెబ్బలు తిని హీరోగా ఎదిగాడు. ఎంత పోటీ ఎదురైనా తట్టుకుని నిలబడ్డాడు. టాలీవుడ్ కు మైఖేల్ జాక్సన్ స్టెప్పులను పరిచయం చేసింది చిరంజీవే.. యాక్షన సీన్స్ లో సరికొత్త ఒరవడికి తెరతీసిన మెగాస్టార్.. తన మార్క్ నటనతో మెగాస్టార్ గా ఎదిగాడు. అన్ని విషయాల్లో తాను స్సెషల్ అని నిరూపించుకుని.. ఈ స్థాయికి వచ్చాడు చిరంజీవి. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. టాలీవుడ్ లో మెగా సాంమ్రాజ్యాన్నే స్థాపించాడు. మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు, నిర్మాతలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. సౌత్ ఇండియాన్ కపూర్స్ ఫ్యామిలీ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి వెల్లడించిన ఈ సంఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తండ్రి, కొడుకుల సినీ ప్రయాణంలో ఇలాంటి కష్టాలు, ప్రశంసలు సహజమే. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.