|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ విధ్వంసం! ఓటీటీలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ.. 500 మిలియన్ రికార్డ్!

Published: 19-02-2026, 9:35 PM
మెగాస్టార్ విధ్వంసం! ఓటీటీలో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ.. 500 మిలియన్ రికార్డ్!
  • మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ జీ5 ఓటీటీలో విడుదల!
  • సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల, బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లు
  • జీ5 ఓటీటీలో విడుదలైన కొద్దిరోజుల్లోనే 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు పూర్తి!
  • త్వరలో జీ తెలుగు ఛానల్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ టెలికాస్ట్ కానుంది

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఓటీటీలో మెగా మానియా

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించాడు. నయనతార ఇందులో హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

రికార్డులు బ్రేక్ చేసిన చిరు మూవీ

300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కొన్ని రోజుల క్రితమే జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో 500 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

జీ తెలుగులో త్వరలో ప్రసారం

ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఈ రేర్ ఫీట్ను టచ్ చేయడంతో మరికొన్ని రోజుల్లో ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే జీ తెలుగు ఛానల్లో ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

మెగాస్టార్ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.