|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిడిల్ ఈస్ట్ యుద్ధం: సామాన్యుడిపై పిడుగులాంటి ధరల మోత!

Published: 04-03-2026, 3:35 AM
మిడిల్ ఈస్ట్ యుద్ధం: సామాన్యుడిపై పిడుగులాంటి ధరల మోత!
  • మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
  • పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹20 వరకు పెరిగే అవకాశం ఉంది.
  • వంట నూనెల ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.
  • బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం వలన చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీని కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్, వంట నూనెలు మరియు బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.

చమురు ధరలపై యుద్ధ ప్రభావం

మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కు సౌదీ అరేబియా దేశాల నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోయింది. హార్మూజ్ జలసంధి మూసివేయడంతో ఇతర దేశాలకు కూడా చమురు సరఫరా ఆగిపోయి.. క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. అయితే ఈ జలసంధిని బ్లాక్ చేయడం వలన రవాణా నౌకలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి రావాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం 15-20 రోజులు పెరగడమే కాకుండా, రవాణా ఖర్చులు కూడా రెట్టింపు అవుతాయి. ఒక చమురే కాదు, భారత్ కు దిగుమతి అయ్యే అనేక వస్తువులు, పదార్థాల ధరలకు రెక్కలు రానున్నాయి.

ధరలు పెరగనున్న వస్తువులివే

1. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు

భారత్ తన చమురు అవసరాలలో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల నుండి వచ్చే చమురు ట్యాంకర్లు నిలిచిపోతాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $100 మార్కును దాటే ప్రమాదం ఉంది. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹10 నుండి ₹20 వరకు పెరగవచ్చు. అలాగే వంట గ్యాస్ (LPG) ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

భారతదేశం తన వంట నూనెల అవసరాల కోసం పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి వాటిని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. వీటిని ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ ఆగ్నేయాసియా దేశాల నుండి వచ్చే నౌకలకు నేరుగా ఇబ్బంది లేకపోయినా, అంతర్జాతీయంగా షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరగడం వల్ల పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. సప్లై చైన్ దెబ్బతినడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి, మార్కెట్లో వంట నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకవచ్చు. ఇది సామాన్యుడి వంటగది బడ్జెట్‌ను తలకిందులు చేస్తుంది.

వంట నూనెల ధరలకు రెక్కలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్), స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చే బంగారం దిగుమతులు ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రభావితమవుతాయి. యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతాయి. రూపాయి విలువ పడిపోవడం కూడా తోడైతే, భారత్‌లో తులం బంగారం ధర ఎన్నడూ చూడని రికార్డు స్థాయికి చేరుకోవచ్చు.

4. ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ ఫోన్లు

మనదేశం ఎలక్ట్రానిక్ పరికరాలను చైనా, తైవాన్, దక్షిణ కొరియా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే తూర్పు ఆసియా నుండి యూరప్ వైపు వెళ్లే నౌకలు లేదా మధ్యప్రాచ్యం మీదుగా వచ్చే సెమీకండక్టర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల రవాణా ఆలస్యం కావడం వల్ల స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాల ధరలు పెరగవచ్చు. షిప్పింగ్ కంపెనీలు తమ మార్గాలను మార్చుకోవడం వల్ల ఇన్సూరెన్స్, రవాణా ఛార్జీలు పెరిగి, ఆ భారం వినియోగదారుడిపైనే పడుతుంది. ఫలితంగా మార్కెట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్ల ధరలు భగ్గుమననున్నాయి.

5. ఎరువులు, ముడి రసాయనాలు

బంగారం ధరలు భగ్గుమనే ఛాన్స్

వ్యవసాయ రంగానికి వెన్నెముక అయిన ఎరువుల కోసం భారత్ గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుంది. ముఖ్యంగా ఒమన్, సౌదీ అరేబియా, జోర్డాన్, మొరాకో వంటి దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుంది. యూరియా, డీఏపీ (DAP) వంటి ఎరువుల దిగుమతులు నిలిచిపోతే సాగు వ్యయం పెరుగుతుంది. ఎరువుల సరఫరా తగ్గితే సాగు ఖర్చులు పెరిగి, పరోక్షంగా బియ్యం, గోధుమలు, పప్పుల వంటి ఆహార ధాన్యాల ధరలు కూడా విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.

6. పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్

ఇరాన్ వార్ వల్ల మనదేశంలో పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి. ప్రతియేటా భారత్ దాదాపు 5 నుంచి 6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను కెనెడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, ఆఫ్గనిస్తాన్ నుంచి జీడిపప్పు, పిస్తాపప్పు, ఎండుద్రాక్ష, ఆప్రికాట్, కుంకుమపువ్వును దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం వీటి సరఫరా నిలిచిపోయి.. ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి.

ఇరాన్ హార్మూజ్ జలసంధి మూసివేయడం వల్ల సరుకుతో కూడిన నౌకలు ఇపుడు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావాల్సి ఉంది. దీనివల్ల ప్రయాణ సమయం 15-20 రోజులు పెరగడమే కాకుండా, రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరిగాయి. ఫలితంగా భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగి.. దేశంలో ద్రవ్యోల్బణానికి (Inflation) దారితీసి అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా దేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. సామాన్యులపై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.