
తేజ సజ్జా మరియు రితిక నాయక్ నటించిన ‘మిరాయ్’ సినిమా రేపు విడుదల కానుంది. 60 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించబడిన ఈ చిత్రం, ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
Key Points
తేజ సజ్జా, రితిక నాయక్ జంటగా నటిస్తున్న 'మిరాయ్' సినిమా రేపు విడుదలవుతోంది.
సినిమా బడ్జెట్ 60 కోట్లకు పైగా ఉండగా, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 45 కోట్లు వచ్చాయి.
సినిమా హిట్ అవ్వాలంటే 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి.
హైప్, టికెట్ రేట్లు, పాన్ ఇండియా రిలీజ్‌తో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
మిరాయ్ సినిమా బడ్జెట్ మరియు బిజినెస్
Mirai Pre Release Business : తేజ సజ్జా, రితిక నాయక్ జంటగా తెరకెక్కుతున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కింది. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా శ్రియ, జగపతి బాబు, జయరాం.. లాంటి చాలా మంది స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.(Mirai Pre Release Business)
ఇప్పటికే మిరాయ్ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ వచ్చి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో ఫాంటసీ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. మిరాయ్ సినిమా రేపు సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతుంది.
థియేట్రికల్ అడ్వాన్స్ లు మరియు అంచనాలు
ఈ సినిమాకు 60 కోట్లకు పైగా ఖర్చుపెట్టారంట. అంత తక్కువ బడ్జెట్ లోనే గ్రాండ్ విజువల్స్ ఇచ్చారు. నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే మిరాయ్ సినిమాకు 45 కోట్లు వచ్చాయట. ఇక మిరాయ్ సినిమాని థియేట్రికల్ అమ్మకుండా అడ్వాన్స్ ల మీద రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్ర నుంచి 16 కోట్లు, సీడెడ్ నుంచి 6 కోట్లు, నైజాం నుంచి 12 కోట్లు అడ్వాన్స్ లు తీసుకున్నారు. రెస్టాఫ్ ఇండియా మొత్తం 5 కోట్లు, ఓవర్సీస్ 5 కోట్లకు అమ్మారు.
సినిమా హిట్ అవ్వడానికి కావలసిన కలెక్షన్స్
అంటే టోటల్ గా మిరాయ్ సినిమాకు ఆల్మోస్ట్ 44 కోట్ల బిజినెస్ జరిగింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 45 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల వరకు గ్రాస్ రావాలి. మిరాయ్ సినిమా మీద ఉన్న హైప్ కి, టికెట్ రేట్లు తక్కువ ఉండటం, పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండటంతో ఈజీగా 100 కోట్లకు పైగా మిరాయ్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
Also See : Dimple Hayathi : డస్కీ బ్యూటీ డింపుల్ హయతి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
మొత్తంమీద, ‘మిరాయ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా హిట్ అయితే మంచి వసూళ్లు రావడం ఖాయం.


