|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిస్‌ వరల్డ్ 2025 టాప్‌ 40కి ఎంపికైన పదిమంది కంటెస్టెంట్లు వీరే.. నందిని గుప్తా బెర్త్ ఖాయం

Published: 25-05-2025, 12:41 PM
మిస్‌ వరల్డ్ 2025 టాప్‌ 40కి ఎంపికైన పదిమంది కంటెస్టెంట్లు వీరే.. నందిని గుప్తా బెర్త్ ఖాయం

మిస్ వరల్డ్ 2025 పోటీలు తమ తుది దశకు చేరుకున్నాయి. టాప్ 40లోకి ఎంపికైన 10 మంది కంటెస్టెంట్లలో భారతదేశం నుండి నందిని గుప్తా కూడా ఉన్నారు. ఆమె టాప్ మోడల్ ఛాలెంజ్ లో విజేతగా నిలిచింది.

Key Points

1

మిస్ వరల్డ్ 2025 టాప్ 40లో నందిని గుప్తా స్థానం ఖాయం.

2

టాప్ 10 కంటెస్టెంట్లలో నలుగురు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ విజేతలు.

4

ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల నుండి అందగత్తెలు ఎంపిక.

టాప్ 10 కంటెస్టెంట్ల ఎంపిక

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు రోజు రోజుకి ఉత్కంఠని పెంచుతున్నాయి. గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఆసక్తి పెరుగుతుంది. ఇండియా నుంచి రాజస్థాన్‌ అమ్మాయి నందిని గుప్తా ఈ మిస్‌ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆ ఇంట్రెస్ట్ మరింతగా పెరిగింది. అయితే ఇప్పుడు ఈ అందాల పోటీలు కీలక ఘట్టానికి చేరుకుంటున్నాయి.

తాజాగా టాప్‌ 10 కంటెస్టెంట్లు ఎవరో తేలిపోయింది. ఫైనల్‌ కోసం టాప్‌ 40 కంటెస్టెంట్లకి పోటీ జరుగుతున్న నేపథ్యంలో వీరిలో టాప్‌ 10 కంటెస్టెంట్లు ఎవరో ఓ క్లారిటీ వచ్చింది.

ఇప్పటి వరకు ఈ పోటీలకు సంబంధించిన నాలుగు దశల్లో వివిధ విభాగాల వారిగా జరిగిన పోటీల్లో పది మంది విజేతలుగా నిలిచారు. వారు ఫైనల్‌ కి బెర్త్‌ ఖాయం చేసుకున్నారు. వీరిలో మన ఇండియా అందగత్తె నందిని గుప్తాకి చోటు దక్కింది.

నందిని గుప్తా విజయం

ఆమె టాప్‌ మోడల్‌ ఛాలెంజ్‌లో విన్నర్‌గా నిలిచింది. ఆసియా ఖండం నుంచి జరిగిన పోటీలో నందిని గుప్తా విన్నర్‌గా నిలిచింది. ఇందులో ఖండాలు వైజ్‌గా పోటీ నిర్వహిస్తారు. మన ఆసియా ఖండం నుంచి ఇతర అందగత్తెలు పోటీల్లో పాల్గొనగా, నందిని విన్నర్‌గా నిలవడం విశేషం.

ఇక ఈ పోటీల్లోే ఆఫ్రికా నుంచి నమీబియా సుందరి సెల్మా కమన్య, అమెరికన్‌-కరేబియ్‌ ఖండం నుంచి మార్టినిక్యూకి చెందిన ఔరెల్లే జోవాచిమ్‌, యూరప్‌ నుంచి ఐర్లాండ్‌ అందగత్తె జాస్మిన గెర్హార్డ్ విన్నర్‌గా నిలిచి గ్రాండ్‌ ఫినాలేలో చోటు సంపాదించుకున్నారు.

వీరితోపాటు టాప్‌ 40 కంటెస్టెంట్లలో స్థానం సంపాదించిన మొదటి పది మందిలో హెడ్‌ టూ హెడ్‌ ఛాలెంజ్‌లో విన్నర్‌గా నిలిచిన నలుగురు అందగత్తెలున్నారు. వారిలో ఆఫ్రికా నుంచి జాంబియా సుందరి ఫెయిత్‌ బ్వాల్వా, అమెరికా-కరేబియన్‌ నుంచి ట్రినిడాడ్‌ అండ్‌ టాబాగో సుందరి అన్నా లిసే నాన్టన్‌, యూరప్‌ నుంచి బేల్స్ అందగత్తె విల్లీ మీ ఆడమ్స్, ఆసియా నుంచి టర్కీ సుందరి ఇదిల్ బిల్గెన్‌ ఉన్నారు.

గ్రాండ్ ఫినాలే కోసం పోటీ

టాలెంట్‌ ఛాలెంజ్‌లో విన్నర్‌ అయిన ఇండోనేషియా అందగత్తె మోనికా కేజియా, స్పోర్ట్స్ ఛాలెంజ్‌లో విన్నర్‌ అయిన యూరప్‌ కి చెందిన ఈస్థోనియా సుందరి ఎలిసే రాండ్మా కూడా ఈ టాప్‌ 10 జాబితాలో చేరారు. అయితే వీరంతా టాప్‌ 40లో భాగమే. ఇందులో మరో 30 మంది అందగత్తెలను ఎంపిక చేస్తారు.

వీరి నుంచి టాప్‌ 20ని సెలక్ట్ చేస్తారు. వారిలో నుంచి టాప్‌ 8ని ఎంపిక చేస్తారు. అంటే ఖండానికి ఇద్దరి చొప్పున సెలక్ట్ చేస్తారు. వారు గ్రాండ్‌ ఫినాలేలో పాల్గొంటారు. వారిలో టాప్‌ 4ని ఫైనల్‌ చేస్తారు. అందులో ఒకరు విన్నర్‌ అయితే ముగ్గురు రన్నరప్‌లు ఉంటారు.

వీరిలో ఒక్కో ఖండం నుంచి ఒక్కరు ఉంటారు. అంటే ఇంకా మూడు దశల్లో ఫిల్టర్‌ ఉంటుంది. మరి ఈమూడు ఫిల్టర్లని దాటుకుని నందిని గుప్తా ఫైనల్‌కి వెళ్తుందా? విన్నర్‌గా నిలుస్తుందా? అనేది చూడాలి. మే 31న హైటెక్స్ లో ఈ అందాల పోటీల ఫైనల్‌ జరగనుంది.

మొత్తంమీద, మిస్ వరల్డ్ 2025 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నందిని గుప్తాతో సహా ఎంపికైన అందగత్తెలు గ్రాండ్ ఫినాలేలో తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.