
‘మిత్ర మండలి’ చిత్రాన్ని ‘జాతి రత్నాలు’తో పోల్చడంపై నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప స్పందించారు. ప్రియదర్శి, నిహారిక నటించిన ఈ బడ్డీస్ కామెడీ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది. ఇందులో బ్రహ్మానందం పాత్ర, ఫిక్షనల్ టౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
Key Points
‘మిత్ర మండలి’ బడ్డీస్ కామెడీ, ‘జాతి రత్నాలు’తో పోలికపై నిర్మాతలు స్పందన.
ప్రియదర్శి, నిహారిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం అక్టోబర్ 16న విడుదల.
బ్రహ్మానందం పాత్ర, 'జంబర్ గింబర్ లాలా' పాట ప్రత్యేక ఆకర్షణ.
‘జంగ్లీ పట్టణం’ అనే ఫిక్షనల్ టౌన్, సామాజిక వ్యంగ్యం యూత్‌కు ఆకట్టుకుంటాయి.
పోలికలపై నిర్మాతల వివరణ
‘మిత్ర మండలి’ అనేది బడ్డీస్ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’ సినిమాతో పోల్చుతున్నారు. కానీ ‘జాతి రత్నాలు’ కథకు, మా సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు’ అన్నారు నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప . ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ మిత్ర మండలి ’. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ..
→ బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. ఓ సారి మా ఇద్దరినీ ఈ కథ వినమని చెప్పారు. కళ్యాణ్ ఎక్కువగా వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. మేం ఇద్దరం ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఆ టైంలో ఈ కథను విన్నాం. ఈ మూవీతో పాటుగా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా స్టార్ట్ చేశాం. వాసు వల్లే ఈ కథ మాకు వచ్చింది. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్‌గా ఉంటుంది.
దర్శకుడు విజయేందర్ పనితీరు
→ విజయేందర్ మంచి దర్శకుడు. అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్, ఆదిత్య హాసన్‌లతో విజయేందర్ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్‌తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు.
→ ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్ గింబర్ లాలా’ పాటను అనుకోకుండా చిత్రీకరించాం. ముందు అసలు ఆ పాటను అనుకోలేదు. కానీ మాకు సినిమా పూర్తయిన తరువాత ఏదో అసంతృప్తిగా అనిపించింది. దీంతో బ్రహ్మానందం గారితో అలా పాటను చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్‌ను ఎంజాయ్ చేశారు.
బ్రహ్మానందం పాత్ర, కథా నేపథ్యం
→ ఈ సినిమా కోసం ‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్‌తో పాటు ఫిక్షనల్ క్యాస్ట్‌ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ ఫిక్షనల్ టౌన్‌లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఫిక్షనల్ క్యాస్ట్‌తో సమాజంలో ఉన్న క్యాస్ట్ సిస్టం మీద సెటైరికల్‌గా సీన్లను చిత్రీకరించాం. ఈ చిత్రం ఎక్కువగా యూత్‌కు రిలేట్ అవుతుంది.. వారికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది.
→ మేం అన్ని రకాల జానర్లలో చిత్రాల్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్‌తో వస్తున్నాం. త్వరలోనే హారర్ మూవీని ప్రారంభించనున్నాం. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథలతో సినిమాల్ని తీయాలని అనుకుంటున్నాం.
మొత్తంగా, ‘మిత్ర మండలి’ చిత్రం వినోదాత్మక బడ్డీస్ కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రత్యేకమైన పాత్రలు, సెటైరికల్ కథాంశంతో యూత్‌కు ఈ చిత్రం మరింత చేరువవుతుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


