
📌 Key Points
- సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు తూలుతున్న వీడియో వైరల్
- మోహన్ బాబు మద్యం సేవించారా అని నెటిజన్ల ట్రోల్స్
- మంచు కుటుంబ వివాదాల నడుమ మరో వీడియో వైరల్
- వీడియోను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అభిమానుల మద్దతు
సీనియర్ నటుడు మోహన్ బాబు సంక్రాంతి వేడుకల్లో తూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన మద్యం సేవించారా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వైరల్ అవుతున్న మోహన్ బాబు వీడియో
Mohan Babu: సోషల్ మీడియాలో ఈ మధ్య చిన్న వీడియోలు కూడా పెద్ద చర్చలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు అయితే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో వల్ల సీనియర్ నటుడు మోహన్ బాబు.. మరోసారి వార్తల్లో నిలిచారు. సంక్రాంతి వేడుకల సమయంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన మోహన్ బాబు.. ఇటీవల సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అదే సమయంలో తీసిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
గత కొంతకాలంగా మంచు కుటుంబం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య జరిగిన విభేదాలు పెద్ద చర్చగా మారాయి. ఆ సమయంలో మోహన్ బాబు మీడియాపై అసహనం వ్యక్తం చేయడం కూడా అప్పట్లో వార్తలకెక్కింది. ఇప్పుడు మరోసారి మోహన్ బాబు పేరు వైరల్ వీడియోతో వార్తల్లోకి వచ్చింది. సంక్రాంతి వేడుకల సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. సినిమాల గురించి ప్రశ్నించగా, “ఇప్పుడు సినిమాలపై మాట్లాడడానికి రాలేదు” అంటూ సూటిగా సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఆయన సాధారణంగానే మాట్లాడినట్టు కనిపించారు.
నెటిజన్ల ట్రోల్స్, విమర్శలు
?utm_source=ig_web_copy_link
కానీ అదే రోజు తీసిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మోహన్ బాబు నిలబడుతూ కొంచెం తూలుతున్నట్టు.. ఆ తరువాత కొన్ని సార్లు కింద పడిపోతున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలామంది “ఫుల్‌గా తాగేసి వచ్చారా?” అంటూ మోహన్ బాబు పై కామెంట్లు పెడుతున్నారు. మరి కొంతమంది ఇప్పుడు మీది అని వెళ్లి ఆయన క్వశ్చన్స్ అడగమనండి అంటూ వెతకారంగా కామెంట్లు పెడుతున్నారు.
మోహన్ బాబుకు మద్దతుగా అభిమానులు
సోషల్ మీడియాలో ఈ వీడియో పెద్ద చర్చకు దారి తీస్తోంది. కొందరు అభిమానులు మాత్రం మోహన్ బాబును సమర్థిస్తూ, వీడియోను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
మొత్తానికి మోహన్ బాబు వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కొందరు ఆయనను విమర్శిస్తుంటే, మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.


