|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మోనాలిసా పెళ్లిలో ఊహించని ట్విస్ట్! భర్తపై పోక్సో కేసు నమోదు!!

Published: 10-04-2026, 2:35 AM
షాకింగ్: మోనాలిసా పెళ్లిలో ఊహించని ట్విస్ట్! భర్తపై పోక్సో కేసు నమోదు!!
  • పూసలు అమ్ముకునే మోనాలిసాను బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
  • కేరళలో రాజకీయ నాయకుల సమక్షంలో ఫర్మాన్ ఖాన్‌ను మోనాలిసా వివాహం చేసుకుంది.
  • వివాహం లవ్ జిహాద్ అని విమర్శించిన దర్శకుడిపై మోనాలిసా లైంగిక ఆరోపణలు చేసింది.
  • వివాహ సమయంలో మోనాలిసా మైనర్ అని తేలడంతో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు అయింది.

పూసలు అమ్ముకుంటూ సెలబ్రిటీగా మారిన మోనాలిసా జీవితంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆమె వివాహం వివాదాస్పదం కాగా, ఇప్పుడు ఆమె మైనర్ కావడంతో భర్తపై పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.

మోనాలిసా సినీ ప్రవేశం, వివాదాలు

Monalisa: మహాకుంభ మేళాలో పూసలు అమ్ముతూ.. ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన పూసలమ్మాయి మోనాలిసా (Monalisa ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తేనె కళ్ళతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమెను చూసి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈమె కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. దాంతో ఈమె పాపులారిటీ మరింత పెరిగిపోయింది. దీనికి తోడు ఈమె ఒక ఆల్బమ్ సాంగ్ లో కూడా కనిపించింది. పైగా కేరళ, చెన్నై వంటి ప్రాంతాలలో పలు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ ఊహించని క్రేజ్ దక్కించుకున్న ఈమె.. తెలుగులో ఒక సినిమాలో హీరోయిన్ గా కూడా అవకాశం అందుకున్న విషయం తెలిసిందే.

హీరోయిన్గా పెట్టి సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకోవాలని చూసిన సనోజ్ మిశ్రాకు అలాగే ఆమె అభిమానులకు, కుటుంబ సభ్యులకు సడన్ షాక్ ఇస్తూ కేరళలో పోలీసులను ఆశ్రయించింది మోనాలిసా. తన పెళ్లికి తన కుటుంబ సభ్యులు అడ్డు చెబుతున్నారని పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన ఈమె ఆ తర్వాత కేరళ రాజకీయ నాయకుల సమక్షంలో పూవార్ లోని ఒక ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక వివాహం జరిగినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఈ జంటను వెంటాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ వివాదం పోలీస్ కేసు వరకు వెళ్లడం సంచలనంగా మారింది.

దర్శకుడిపై లైంగిక ఆరోపణలు

మోనాలిసా పెళ్లిపై మొదటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. వీరి వివాహాన్ని లవ్ జిహాద్ అంటూ దర్శకుడు విమర్శించారు. అలాంటి ఈ దర్శకుడి పై లైంగిక ఆరోపణలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే ఈ వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మోనాలిసా మైనర్ అనే విషయం ఒక్కసారిగా వెలుగు చూసింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) జరిపిన విచారణలో పెళ్లి సమయానికి ఆమె వయసు చాలా తక్కువగా ఉందని తేలడంతో ఫర్మాన్ ఖాన్ పై ఎవరు ఊహించని విధంగా పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం..

ఇకపోతే పూసలు అమ్ముకునే ఒక సామాన్య అమ్మాయి స్టార్ గా మారడం, ఆ తర్వాత మతం మార్చుకొని పెళ్లి చేసుకోవడం , ఇప్పుడు మైనర్ కావడంతో ఆమె భర్త జైలుకు వెళ్లే పరిస్థితి రావడం అన్నీ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇందుకు సంబంధించిన పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. ప్రస్తుతం అటు సోషల్ మీడియాలో కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చే జరుగుతోంది. ఇక నిజంగానే మోనాలిసా మైనరా? లేక ఇదంతా కుట్రలో భాగమేనా?అంటూ నెటిజన్లు కూడా ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఈ పూసలమ్మాయి జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఆమెను మరింత మానసిక క్షోభకు గురిచేస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘటన ఎంతవరకు వెళ్తుందో చూడాలి..

మైనర్ వివాదం, పోక్సో కేసు నమోదు

పూసలమ్మాయి మోనాలిసా జీవితం ఒక మలుపు తిరిగింది. ఆమె స్టార్‌గా ఎదగడం, వివాదాలు, ఇప్పుడు భర్తపై పోక్సో కేసు వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.