|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోనాలిసా పెళ్లి: షాకింగ్ నిజాలు బయటపెట్టిన చెల్లి! కుటుంబం రోడ్డున పడటానికి ఇదే కారణమా?

Published: 24-03-2026, 6:15 AM
మోనాలిసా పెళ్లి: షాకింగ్ నిజాలు బయటపెట్టిన చెల్లి! కుటుంబం రోడ్డున పడటానికి ఇదే కారణమా?
  • మోనాలిసా వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని ఆమె చెల్లి ఇషిక ఆవేదన వ్యక్తం చేసింది.
  • ఫర్మాన్ ఖాన్ మోనాలిసా ఫోన్ లాక్కున్నాడని, కుటుంబం పస్తులు ఉంటోందని ఇషిక తెలిపింది.
  • తండ్రి పిచ్చోడిలా రోడ్ల వెంట తిరుగుతున్నాడని, పూసలు అమ్ముకునే రోజులే సంతోషంగా ఉండేవని ఆమె వాపోయింది.
  • మోనాలిసా తీసుకున్న నిర్ణయం వల్ల కుటుంబం రోడ్డున పడిందని నెటిజన్లు మండిపడుతున్నారు.

వైరల్ గర్ల్ మోనాలిసా వివాహం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆమె చెల్లెలు ఇషిక, మోనాలిసా పెళ్లి కారణంగా తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

కుటుంబం రోడ్డున పడటానికి మోనాలిసా కారణమా?

Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా (Minalisa)గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. మహాకుంభమేళా ప్రయాగ్ రాజ్ లో తన తేనె కళ్ళతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఆ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈమె ఫోటోలే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ముఖ్యంగా మహాకుంభమేళాలో ఈమెను చూసిన యాత్రికులు ఈమెతో ఫోటో దిగడానికి తెగ ఆసక్తి కనబరిచారు. దీంతో పూసల అమ్ముతున్న వారు తమ వ్యాపారానికి ఇబ్బంది కలుగుతుందన్న నేపథ్యంలో ఈమె తండ్రి ఈమెను తీసుకొని తమ సొంత గ్రామానికి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.

ఇక తర్వాత ఈమెకు బాలీవుడ్ డైరెక్టర్ అవకాశం ఇస్తానని ఇండస్ట్రీకి తీసుకురావడం.. ఈమె చేత ఒక ఆల్బమ్ సాంగ్ చేయించడం. హీరోయిన్గా ప్రకటించి ఒక సినిమా కథను కూడా రూపొందించడం అన్నీ జరుగుతున్న సమయంలో సడన్గా ఈమె ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వార్తల్లో నిలిచింది. ఇకపోతే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే కేరళ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి కొంతమంది రాజకీయ నాయకుల సమక్షంలో ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.ఇక ఈమె వివాహం లవ్ జిహాద్ అని, ఈమెను నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నారని బాలీవుడ్ డైరెక్టర్ మండిపడ్డారు. అంతేకాదు అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలుస్తానని ఆయన హెచ్చరించారు. అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఈమె వల్ల తమ కుటుంబం రోడ్డున పడింది అంటూ ఈమె చెల్లి ఇషిక చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

చెల్లి ఇషిక సంచలన ఆరోపణలు

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మోనాలిసా చెల్లి ఇషిక మాట్లాడుతూ..”మా అక్క ఫోనును ఫర్మాన్ ఖాన్ లాగేసుకున్నాడు. మా అక్క చేసిన పనికి ఇప్పుడు మా కుటుంబం అంతా పూసలు అమ్మడం మానేసి ఇంట్లో పస్తులు ఉండాల్సి వస్తోంది. మా నాన్న అయితే పిచ్చోడిలా రోడ్ల వెంట తిరుగుతున్నాడు. మేము పూసలు అమ్ముకునేటప్పుడే చాలా సంతోషంగా ఉండే వాళ్ళం. ఇప్పుడు మా అక్క చేసిన పనికి మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది “అంటూ మోనాలిసా చెల్లెలు ఇషిక తన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇషికా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. చేతిలో ఒక సినిమా. లక్షల్లో డబ్బు.. కావలసినంత గుర్తింపు ఇస్తున్నా కానీ నువ్వు తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల నీ కుటుంబం అంతా రోడ్డున పడింది అంటూ ఆమెపై మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెటిజన్ల ఆగ్రహం

మోనాలిసా విషయానికి వస్తే.. ఈమె ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది .గత ఏడాది నవంబర్లో హైదరాబాదులో నిర్వహించిన ఆ మూవీ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. వర్తమాన నటుడు సాయిచరణ్ హీరోగా, దర్శకుడు శ్రీను కోటపాటి తెరకెక్కిస్తున్న చిత్రమది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలా చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మోనాలిసా తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.