
సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్, తన కష్టాల గురించి, తన కుటుంబం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన నటుడిగా ప్రయాణం, ఆర్థిక పరిస్థితులు, తన తండ్రి గురించి ఆయన వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Key Points
మౌళి తనూజ్ ప్రశాంత్ సోషల్ మీడియాలో మొదలుపెట్టి నటుడిగా ఎదిగాడు.
90s వెబ్ సిరీస్ తో అతనికి మంచి గుర్తింపు లభించింది.
తన కుటుంబ అప్పులను తీర్చాడని, తండ్రి ఇప్పటికీ ఆటో నడుపుకుంటున్నాడని తెలిపాడు.
లిటిల్ హార్ట్స్ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.
సోషల్ మీడియా నుండి సిల్వర్ స్క్రీన్ వరకు
Mouli Tanuj Prasanth : సోషల్ మీడియాలో మీమర్ గా, రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ ఆ తర్వాత నటుడిగా మారాడు. 90s వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. మౌళి ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మౌళి, శివాని జంటగా లిటిల్ హార్ట్స్ అనే సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మౌళి ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో తన గురించి తెలిపాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మౌళి మాట్లాడుతూ.. మాది అంత లగ్జరీ లైఫ్ కాదు. మా నాన్న ఆటో నడుపుతూ కిరాణా షాప్స్ కి సరుకులు వేస్తూ ఉంటారు. మాకు చాలా లోన్స్ ఉన్నాయి. అందుకే మా నాన్న ఎక్కువ కష్టపడేవాడు. 90s సిరీస్ తో ఆ అప్పులన్నీ తీర్చేసాను. నా బాధ్యత నేను చేశాను. అయినా మా నాన్న ఇప్పటికి అదే ఆటో నడుపుకుంటాడు. నేను వద్దని చెప్పినా ఆయన ఇష్టం. నేను ఎక్కువ సేవింగ్స్ చేస్తాను. మా ఫ్యామిలీ అప్పులు తీర్చినందుకు నాకు సంతోషంగా ఉంది అని తెలిపాడు.
కుటుంబ బాధ్యతలు మరియు ఆర్ధిక విజయం
లిటిల్ హార్ట్స్ సినిమా విడుదల
మౌళి సోషల్ మీడియాలో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మౌళి చెప్పిన విషయం వైరల్ అవ్వడంతో నువ్వు గ్రేట్ బ్రో ఇంట్లో బాధ్యతలు తీసుకున్నావు, కష్టపడి పైకి వచ్చావు అని పలువురు సోషల్ మీడియాలో మౌళిని అభినందిస్తున్నారు.
మౌళి తన కష్టపడి సంపాదించిన డబ్బుతో తన కుటుంబ అప్పులను తీర్చడం అభినందనీయం. తన తండ్రి ఇంకా ఆటో నడుపుకోవడం అతని నిజాయితీని చాటుతుంది. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా అతనికి మరింత విజయం అందించాలని కోరుకుందాం.


