|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mowgli Postponed : అఖండ 2 ఆగమనం… వెనక్కి తగ్గిన మోగ్లి.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Published: 09-12-2025, 3:08 AM
Mowgli Postponed : అఖండ 2 ఆగమనం… వెనక్కి తగ్గిన మోగ్లి.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
  • బాలకృష్ణ అఖండ 2 సినిమా డిసెంబర్ 5 నుండి 12వ తేదీకి వాయిదా పడింది.
  • అఖండ 2 రాకతో డిసెంబర్ 12న విడుదల కావాల్సిన చిన్న సినిమాలు వెనకడుగు వేస్తున్నాయి.
  • సుమ కనకాల కుమారుడు రోషన్ నటించిన మోగ్లి సినిమా 2026 ఫిబ్రవరికి వాయిదా పడింది.
  • మోగ్లి కొత్త విడుదల తేదీపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

బాలకృష్ణ నటించిన అఖండ 2 విడుదల తేదీ మారడంతో, చిన్న సినిమాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా నటించిన మోగ్లి సినిమా కూడా వాయిదా పడింది. మోగ్లి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అఖండ 2 విడుదల తేదీ మార్పు

Mowgli Post poned: బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ఆఖండ 2 (Akhanda 2)ఆగమనానికి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సి ఉండగా, ఫైనాన్స్ ఇబ్బందుల కారణంగా ఒక వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ విడుదల కాబోతున్న విషయాన్ని అధికారకంగా ప్రకటించడంతో చిన్న సినిమాలని తదుపరి డిసెంబర్ 12వ తేదీ విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే ఉన్నఫలంగా అఖండ 2, డిసెంబర్ 5 వ తేదీ వాయిదా పడి డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతుందని తెలుస్తుంది.

ఇలా బాలకృష్ణ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతుందని, మరి కాసేపట్లో చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించబోతున్నారని విషయం తెలియడంతో డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న చిన్న సినిమాలు అయోమయ పరిస్థితులలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో సినిమా డిసెంబర్ 12వ తేదీ నుంచి వెనకడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుమ కనకాల కుమారుడు రోషన్ (Roshan)హీరోగా సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వంలో నటించిన మోగ్లీ (Mowgli)సినిమా కూడా వాయిదా పడబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల చేయాలని చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

మోగ్లి వాయిదా పడటానికి కారణం

ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలతో పాటు ట్రైలర్ కూడా విడుదల చేస్తూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. అయితే ఆఖండ 2 డిసెంబర్ 12వ తేదీ రాబోతున్న నేపథ్యంలో మోగ్లి సినిమా 2026 ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా వాయిదా పడటం, ఫిబ్రవరిలో తిరిగి విడుదల కావడం గురించి ఇప్పటివరకు చిత్ర బృందం ఎక్కడ అధికారికంగా స్పందించలేదు త్వరలోనే ఈ సినిమా విడుదల విషయంపై క్లారిటీ రానుంది.

సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా కలర్ ఫోటో ఫ్రేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లవ్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రోషన్ కు జోడిగా సాక్షి హీరోయిన్ గా నటించగా, బండి సరోజ్ విలన్ పాత్రలో కనిపించానన్నారు. ఇలా ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి కాని చివరి నిమిషంలో ఈ సినిమా కూడా వాయిదా పడిపోతుందని తెలియడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 2026 ఫిబ్రవరిలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న మోగ్లీ సినిమాతో పాటు ఈషా, సినిమా కూడా వాయిదా పడిందని తెలుస్తుంది. ఇక ఇదే రోజున కార్తీ కృతి శెట్టి జంటగా నటించిన అన్నగారు వస్తారు కూడా విడుదల కానుంది. మరి ఈ సినిమా యధావిధిగా విడుదలవుతుందా లేదంటే వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

మోగ్లి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?

మోగ్లి సినిమా వాయిదాపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో విడుదల కానుందని వార్తలు వస్తున్నప్పటికీ, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే స్పష్టత వస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.