
📌 Key Points
- శ్రీవిష్ణు హీరోగా ‘మృత్యుంజయ్’ చిత్రం మార్చి 6న విడుదల కానుంది.
- ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించారు.
- రామ్ పోతినేని చేతుల మీదుగా ‘ఈ జిందగీ’ పాట విడుదలైంది.
- కాల భైరవ సంగీతం, అభినవ్ కవి ర్యాప్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘మృత్యుంజయ్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘ఈ జిందగీ’ అనే పాటను రామ్ పోతినేని విడుదల చేశారు. ఈ చిత్రానికి సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాతలు.
‘మృత్యుంజయ్’ మూవీ విడుదల తేదీ
Mrithyunjay: శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’ (Mrithyunjay). ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ (Reba Monica John) ఈ చిత్రంలో మరోసారి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 6న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచేయగా, బుధవారం ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ (Ee Zindagi)ని విడుదల చేశారు. ఈ పాట స్పెషల్ ఏంటంటే.. హీరో రామ్ (Ram Pothineni) సపోర్ట్ అందించడం.
రామ్ చేతుల మీదుగా ‘ఈ జిందగీ’ పాట విడుదల
అవును, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘ఈ జిందగీ’ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేయించారు. ఈ పాటను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసిన రామ్.. టీమ్‌కు బెస్ట్ విషెస్‌ను అందించారు. భగవద్గీత శ్లోకంతో ప్రారంభమైన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా, శ్రీవిష్ణులోని పలు కోణాలను తెలియజేస్తుంది. ఈ పాటలో శ్రీవిష్ణు పలు అవతారాలలో కనిపిస్తుండటం విశేషం. లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. కాల భైరవ అందించిన బాణీ, అభినవ కవి ర్యాప్ వెర్షన్ సాంగ్‌ని రిపీట్ మోడ్‌లో వినేలా చేస్తున్నాయి. అభినవ కవి, కృష్ణకాంత్ రాసిన సాహిత్యం అయితే జీవితం, అందులో ఎదురయ్యే సవాళ్ల గురించి గొప్పగా చాటి చెబుతోంది. అందుకే ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
పాటలో శ్రీ విష్ణు విభిన్న కోణాలు
హీరో శ్రీ విష్ణు తన గ్యాంగ్‌తో కలిసి చేసే పనులు, ఆ పనులతో వాళ్లకి ఎదురైన సవాళ్లు, వారి స్నేహ బంధం ఇలా అన్నీ రకాల ఎమోషన్స్‌ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించినట్లుగా ఈ లిరికల్ వీడియో తెలియజేస్తుంది. ఈ పాటకు ఆదిత్య అయ్యంగార్ గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ‘మృత్యుంజయ్’ మూవీని 6 మార్చి, 2026న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ విష్ణు శైలిలో రూపొందిన ఈ థ్రిల్లర్ మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని టీమ్ హామీ ఇస్తోంది. అందులోనూ వారం గ్యాప్‌లోనే శ్రీవిష్ణు నుంచి రెండు సినిమాలు రాబోతుండటంతో.. మరింత ఆసక్తి ఏర్పడింది. రెండు సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొంటూ.. శ్రీవిష్ణు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
‘మృత్యుంజయ్’ చిత్రం మార్చి 6న విడుదల కానుంది. రామ్ పోతినేని ఈ చిత్రానికి మద్దతు తెలుపడం సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


