
బిపాసా బసు వివాదం తరువాత, మృణాల్ ఠాకూర్ మరో వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ సినిమాను తిరస్కరించిన విషయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు.
Key Points
బిపాసా బసుపై మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
మరో బాలీవుడ్ సినిమాను తిరస్కరించిన విషయంపై మృణాల్ మాట్లాడింది.
ఆ సినిమాలో నటించిన నటికి సినిమా సూపర్ హిట్‌తో స్టార్డమ్ వచ్చిందని తెలిపింది.
నెటిజన్లు మృణాల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
బిపాసా బసు వివాదం
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవలే ఓ వివాదంలో చిక్కుకుంది . బాలీవుడ్ నటి బిపాసా బసును ఉద్దేశించి గతంలో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి . దీంతో మృణాల్ ఠాకూర్ పై నెటిజన్స్ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు సినీస్టార్స్ సైతం స్పందించారు . ఆ తర్వాత ఆ వయసులో తెలియక అలా మాట్లాడానని .. ఎవరినైనా బాధపెట్టి ఉండే క్షమించాలని సోషల్ మీడియా వేదికగా కోరింది . దీంతో ఆ వివాదానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడింది .
మరో సినిమా తిరస్కరణ
అయితే మృణాల్ ఠాకూర్ సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . బాలీవుడ్ లో తాను నటించాల్సిన సినిమా గురించి అందులో మాట్లాడింది . ఆ మూవీని తాను తిరస్కరించినట్లు మృణాల్ తెలిపింది . ఒకవేళ నేను ఆ చిత్రంలో చేసి ఉంటే .. నన్ను నేను కోల్పోయేదాన్ని అంటూ కామెంట్స్ చేసింది . కానీ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నా స్థానంలో నటించిన ఆమెకు స్టార్ డమ్ ను తీసుకొచ్చిందని మృణాల్ ఠాకూర్ తెలిపింది . అయితే ప్రస్తుతం ఆమె సినిమాలు చేయట్లేదని పేర్కొంది .
నెటిజన్ల ఆగ్రహం
ఆ సినిమా పేరు చెప్పకపోయినప్పటికీ నెటిజన్స్ మాత్రం మృణాల్ ఠాకూర్ పై మండిపడుతున్నారు . సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా గురించే మాట్లాడారని కామెంట్స్ చేస్తున్నారు . ఆ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క శర్మ నటించారని .. ఆమెను అవమానపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్స్ మరోసారి ఫైరవుతున్నారు . ఆ సినిమాలో చేసినందుకు ఇప్పుడు అనుష్క శర్మ నటించడం లేదని .. ఆమెను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు . ఇటీవలే బిపాసా బసుపై కామెంట్స్ తో వివాదానికి కారణమైన సీతారామం బ్యూటీ .. మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది .
మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలు మరోసారి వివాదాన్ని రేకెత్తించాయి. నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ఆమె స్పందించాల్సి ఉంది.


