
📌 Key Points
- మృణాల్ ఠాకూర్ ‘దో దీవానే శహర్ మే’ ప్రమోషన్స్‌లో బ్రేకప్‌పై సంచలన వ్యాఖ్యలు!
- ధనుష్‌తో రూమర్స్‌పై మండిపడ్డ మృణాల్.. అవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్ అంటూ క్లారిటీ!
- అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్’ మూవీలో మృణాల్.. ఉగాదికి థియేటర్లలో రిలీజ్!
- మార్చి 19న ‘డెకాయిట్’ విడుదల.. యాక్షన్ డ్రామాతో అదరగొట్టనున్న అడివి శేష్, మృణాల్!
టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన బ్రేకప్ గురించి, ధనుష్‌తో వస్తున్న రూమర్స్ గురించి ఓపెన్ అయింది. అంతేకాదు, అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందో తెలుసా?
బ్రేకప్‌పై మృణాల్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సెన్సేషన్ ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం తను నటిస్తున్న వరుస చిత్రాల్లో ఒకటైన ‘దో దీవానే శహర్ మే’ ఫిబ్రవరి 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన లవ్ బ్రేకప్‌పై మరోసారి స్పందించింది. ‘నేను చాలా ఆగ్రెసీవ్‌గా ఉంటానని తను నాకు బ్రేకప్ చెప్పాడు. అందుకు నేనేమ్ బాధపడలేదు. తన మనస్తత్వమే అంతే అనుకున్నా. అలాగే నేను నటించడం కూడా తనకు ఇష్టం లేదు. మా బ్రేకప్‌కు ఇది కూడా ఒక కారణం. అయినా అలాంటి వాళ్లతో రిలేషన్ కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు అనిపించింది. ఇక అందుకే విడిపోయాం’ అని తెలిపింది.
ఇక ధనుష్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘ధనుష్ నాకు మంచి స్నేహితుడని ఎన్ని సార్లు చెప్పిన కూడా ఇలాంటి రూమర్స్ స్ర్పెడ్ చేస్తూనే ఉంటారు. ఒక్కోసారి నాకు చాలా నవ్వు వస్తుంది. అవన్నీ ఫ్రీ పీఆర్ స్టంట్’ అంటూ తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టింది. కాగా.. మృణాల్ తెలుగులో ‘డెకాయిట్’ చిత్రం చేస్తుంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఉగాది పండుగ స్పెషల్‌గా మార్చి 19న థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ధనుష్‌తో రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మృణాల్
ఉగాదికి ‘డెకాయిట్’ మూవీ రిలీజ్
మొత్తానికి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉంది. ‘డెకాయిట్’ మూవీతో టాలీవుడ్‌లో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


