
📌 Key Points
- మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ తర్వాత తెలుగు ప్రేక్షకుల నుండి ఊహించని ప్రేమను అందుకుంది.
- అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ చిత్రంలో నటించనుంది, టీజర్ ఇటీవల విడుదలైంది.
- తెలుగు, హిందీ సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేయడం కష్టమైనా ప్రయత్నిస్తున్నానని మృణాల్ తెలిపింది.
- కమర్షియల్ రోల్స్‌తో పాటు కంటెంట్ డ్రివెన్ స్టోరీలలో నటించడానికి మృణాల్ ఆసక్తి చూపుతోంది.
‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను అక్కున చేర్చుకున్న తీరుపై ఎమోషనల్ అయ్యింది. ఊహించని ప్రేమ, ఆదరణ తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తదుపరి చిత్రం ‘డెకాయిట్’, భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా వెల్లడించింది.
తెలుగులో మృణాల్ అనుభవాలు, ఎమోషనల్ కామెంట్స్
హిందీ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)నటనపై ఆసక్తితో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చింది. దుల్కర్ సల్మాన్ సరసన ‘సీతారామం’ మూవీలో సీతగా నటించిన ఈ భామ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ప్రేక్షకులను మంత్రమగ్దులను చేసింది. ఒక్క సినిమాతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఊహించని పాపులారిటీ రావడంతో పాటుగా వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఆమె నటించిన చిత్రాల్లో ‘హాయ్ నాన్న’ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి. ఇక గత ఏడాది ‘కల్కి’లో కీలక పాత్రలో కనిపించిన మృణాలం మంచి క్రేజ్ రాబట్టుకుంది. ప్రజెంట్ బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అలాగే తెలుగులో అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ (dacoit)మూవీలో హీరోయిన్‌గా కనిపించనుంది.
‘డెకాయిట్’ టీజర్, ఇతర ప్రాజెక్టులు
అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ ‘డెకాయిట్’ టీజర్ లాంచ్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మృణాల్‌కు పలు ప్రశ్నలు ఎదురవగా.. ఆమె సమాధానాలు ఇచ్చింది. హిందీ, తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడంపై మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా కెరీర్‌లో మరో మైలురాయి అవుతుంది. అడివి శేష్‌తో స్క్రీన్‌షేర్ చేయడం ఓ మంచి అనుభవం. స్క్రిప్ట్ వినగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నా క్యారెక్టర్ చాలా దృఢమైనది. భావోద్వేగాల మేళవింపు ఉన్న పాత్ర. అయితే హిందీ, తెలుగు సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. కానీ నేను బ్యాలెన్స్ చేయడానికి నా వంతు ఉత్తమ ప్రయత్నం చేస్తున్నాను. నా హృదయానికి చాలా దగ్గరైన తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను. అవి నన్ను కదిలించాలి.
భవిష్యత్తు ప్రణాళికలు, కంటెంట్ డ్రివెన్ సినిమాలు
అలాగే ఆ భావన తెరపై కూడా ప్రతిబింబించాలి. సీతారామం తర్వాత తెలుగు కుటుంబంలో భాగమైనట్టుగా అనిపించింది. ఇక్కడి ప్రేక్షకులు ఇంత ప్రేమ చూపుతారని ఊహించలేదు. నన్ను అక్కున చేర్చుకున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి ప్రేమే మరిన్ని మంచి సినిమాలు చేయాలని ప్రేరణనిస్తుంది’’ అని చెప్పింది. అలాగే భవిష్యత్తులో చేయాలనుకుంటున్న సినిమా పాత్రల గురించి మృణాల్ మాట్లాడుతూ.. “కమర్షియల్ రోల్స్‌తో పాటు కంటెంట్ డ్రివెన్ స్టోరీలు కూడా చేయాలనుంది. మంచి స్క్రిప్ట్ ఉంటే లాంగ్వేజ్ అనేది లేదు.. దక్షిణాదిలో అయితే ప్రేక్షకుల ప్రేమ, గౌరవం వేరు. ఇక్కడి ప్రేక్షకులు ఆర్టిస్టులను తమ కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది” అని అన్నారు.
మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమ పట్ల ఆమెకున్న గౌరవాన్ని, ప్రేక్షకులతో ఆమె బంధాన్ని స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆమె మరిన్ని అద్భుతమైన తెలుగు చిత్రాలతో అలరిస్తుందని ఆశిద్దాం.


