|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

MSG సునామీ: మన శంకర వర ప్రసాద్ గారి ఊచకోత! బాలయ్య, వెంకీ ఫ్యాన్స్ షాక్!

Published: 12-01-2026, 10:30 AM
MSG సునామీ: మన శంకర వర ప్రసాద్ గారి ఊచకోత! బాలయ్య, వెంకీ ఫ్యాన్స్ షాక్!
  • చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.40 కోట్ల గ్రాస్ వసూలు!
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా!
  • ఓవర్సీస్‌లో ఆల్రెడీ రూ.10 కోట్లు దాటింది, మొదటి రోజు రూ.15 కోట్లు దాటే అవకాశం!
  • బాలకృష్ణ ‘అఖండ 2’ రికార్డు బ్రేక్! వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రికార్డును చిరు కొల్లగొట్టే ఛాన్స్!

మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

డే 1 కలెక్షన్ల అంచనా: రికార్డు బ్రేకింగ్?

చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా, వెంకటేష్‌ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందింది. ఇది సోమవారం విడుదలైంది. అయితే ప్రీమియర్స్ నుంచే  బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. కలెక్షన్ల విషయంలోనూ అదే జోరు చూపిస్తోంది. దీంతో ఈ మూవీ ఇప్పుడు సీనియర్లలో అందరు హీరోల రికార్డులను బ్రేక్‌ చేయబోతుంది. బాలయ్య, వెంకటేష్‌ మూవీస్‌ ఫస్ట్ డే వసూళ్లని బ్రేక్‌ చేయనుందని టాక్‌.

చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మొదటి రోజు రూ.40కోట్ల గ్రాస్‌ ని వసూలు చేస్తుంది. ఇది పాన్‌ ఇండియా స్టార్స్ రేంజ్‌ బుకింగ్స్ కావడం విశేషం. ఇన్నాళ్లు అనేక రకాలుగా ట్రోల్ కి గురయిన చిరంజీవి ఇప్పుడు అందరికి `మన శంకర వర ప్రసాద్‌ గారు`తో సమాధానం చెప్పబోతున్నారు. అందుకు ఈ అడ్వాన్స్ బుకింగ్స్, డే 1 కలెక్షన్లే ఉదాహరణగా చెప్పొచ్చు.

ఓవర్సీస్‌లో దుమ్ము రేపుతున్న ఎంఎస్‌జీ

ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం `ఎంఎస్‌జీ` మూవీ మొదటి రోజు రికార్డ్ వసూళ్లని రాబట్టబోతుందట. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏకంగా రూ. 70 కోట్ల వరకు వసూళు చేసే అవకాశం ఉందట. ఈ మూవీ రూ.60-70కోట్ల వరకు మొదటి రోజు రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఎవర్సీస్‌లో పది కోట్లు దాటింది. అక్కడే మొదటి రోజు రూ.15కోట్ల దాటబోతుందట. ఇక ఇండియాలోనూ మంచి జోరు చూపిస్తుంది. కర్నాటకలోనూ రచ్చ చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీ రేంజ్‌ వేరే లెవల్‌ అని, ఇక్కడ నలభై కోట్లు దాటే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇది రికార్డు అని చెప్పొచ్చు. సీనియర్ హీరోల్లో ఎవరికీ ఈ రికార్డు లేదు. బాలకృష్ణ నటించిన `అఖండ 2` మూవీ ఇప్పటి వరకు తొలి రోజు అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.59కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ రికార్డులను చిరంజీవి మూవీ బ్రేక్‌ చేయబోతుంది. అలాగే వెంకటేష్‌ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ కూడా సుమారు నలభై కోట్లుమొదటి రోజు రాబట్టింది. దీన్ని కూడా చిరు మూవీ మొదటి రోజు ఈజీగా దాటబోతుంది. సరికొత్త సంచలనంగా నిలవబోతుందని సమాచారం.

బాలయ్య, వెంకీ రికార్డులు గల్లంతు?

సీనియర్‌ హీరోల్లో వెంకటేష్‌ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సుమారు మూడు వందల కోట్లు రాబట్టిందని టాక్‌. దీనికి అనిల్‌ రావిపూడినే దర్శకుడు. ఇప్పుడు తన రికార్డుని తానే బ్రేక్‌ చేసుకోబోతున్నాడు అనిల్‌. చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌`తో ఆ మూవీని దాటబోతున్నారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇందులోనూ వెంకీ భాగం కావడం విశేషం. ఇలా వెంకీ, అనిల్‌ కలిసి తన రికార్డుని బ్రేక్‌ చేయబోతున్నారని టాక్‌. ఇక `మన శంకర వర ప్రసాద్‌ గారు`  లైఫ్‌ టైమ్‌లో నాలుగు వంద కోట్లు దాటే అవకాశం ఉందని టాక్‌.

‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ కలెక్షన్ల వేట మొదలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మెగాస్టార్ ఏం చేస్తారో చూడాలి. కలెక్షన్ల సునామీ సృష్టిస్తారా?

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.