
📌 Key Points
- అభిమానులు తమ హీరో సినిమా తొలి టికెట్‌కు లక్షలు వెచ్చించడం సాధారణమైంది.
- చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.
- అమలాపురంలో MSVPG తొలి టికెట్ రూ.1.11 లక్షలకు వేలంపాటలో అమ్ముడైంది.
- వెంకటరమణ థియేటర్‌లో మెగా అభిమాని వెంకట్ సుబ్బారావు టికెట్ దక్కించుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తొలి టికెట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమలాపురంలో ఒక అభిమాని రూ.1.11 లక్షలు వెచ్చించి ఈ టికెట్‌ను దక్కించుకోవడం రికార్డు సృష్టించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అధిక ధరకు టికెట్ల కొనుగోలు: ట్రెండ్ ఎలా మొదలైంది?
MSVPG:ఈ మధ్యకాలంలో అభిమానులు తమ అభిమాన హీరో సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు భారీ ధరకు మొదటి టికెట్ ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే రూ.250 విలువచేసే టిక్కెట్ కి ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించడానికి కూడా వెనుకాడడం లేదు. అటు నిర్మాతలు కూడా స్టార్ హీరోల సినిమా టికెట్ వేలంపాట వేస్తూ బాగా క్యాష్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి దిగ్గజ హీరోల సినిమాల టికెట్ ను లక్షల రూపాయలకు దక్కించుకున్న అభిమానులు.. ఇప్పుడు అదే స్థాయిలో చిరంజీవి సినిమా టికెట్ ను అధిక స్థాయిలో వెచ్చించి దక్కించుకోవడం వైరల్ గా మారింది.
MSVPG తొలి టికెట్ వేలం: పూర్తి వివరాలు
అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి హీరోగా , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఆన్లైన్ టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. అటు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమలాపురంలో ఈ సినిమా మొదటి టికెట్ ను ఒక అభిమాని వేలం పాటలో ఏకంగా రూ.1.11 లక్షలకు సొంతం చేసుకున్నారు. అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో ఈ వేలం పాట జరగగా.. మెగా అభిమాని వెంకట్ సుబ్బారావు ఈ టికెట్ ను దక్కించుకోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
సోషల్ మీడియాలో వైరల్: మెగా ఫ్యాన్స్ క్రేజ్
అభిమానం చాటుకోవడానికి లక్షలు వెచ్చించడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. MSVPG తొలి టికెట్ వేలంపాట ఈ ధోరణికి తాజా నిదర్శనం. ఈ సంఘటన సినీ అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది.


