
📌 Key Points
- చిరంజీవి వింటేజ్ లుక్‌లో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదల.
- రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీ.
- బుక్ మై షోలో 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన రికార్డు.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ విజయం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.
రెండు రోజుల్లో 100 కోట్ల క్లబ్‌లో చిరంజీవి మూవీ
MSVPG Movie:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చాలా రోజుల తర్వాత మళ్లీ వింటేజ్ లుక్కులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఘరానా మొగుడు రేంజ్ లో కామెడీ పండిస్తూ ఆడియన్స్ హృదయాలను దోచుకుంటున్నారు.సంక్రాంతి పండక్కు వచ్చిన ఈ సినిమా అసలైన సంక్రాంతి పండుగను తీసుకొచ్చిందని.. మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ కీలకపాత్ర పోషించగా.. నయనతార హీరోయిన్గా నటించినది. అలాగే కేథరిన్ కూడా కీలకపాత్ర పోషించారు.
జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. పైగా ఈ చిత్రానికి అటు బుక్ మై షో లో ఏకంగా 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా విడుదలై రెండు రోజులు పూర్తవడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిందని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ పంచుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు
మెగాస్టార్ నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అది కూడా కేవలం రెండు రోజుల్లోనే అంటూ ఒక పోస్టర్ ను పంచుకుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిరంజీవి ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
చిరంజీవి తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో చేసిన విశ్వంభర సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. పైగా ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అందుకే ఈ సినిమాను వాయిదా వేసి మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు విశ్వంభరపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమయ్యారు చిరంజీవి. ఏది ఏమైనా ఏడు పదుల వయసులో కూడా ఇలా వరుస సినిమాలు చేస్తూ తన ఎనర్జిటిక్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరింత పాపులర్ అయిపోయారు చిరంజీవి..
#HappyBhogi2026 to everyone ❤️
చిరంజీవి తదుపరి చిత్రం ‘విశ్వంభర’
SWAG KA BAAP is setting Box-office on fire across the globe 🔥🔥🔥
₹120Crores+ Gross worldwide in 2 DAYS for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥❤️🔥❤️🔥 #MegaBlockbusterMSG #MSGonJan12th #Chiranjeevi #chiranjeevikonidela #nayanthara #AnilRavipudi … pic.twitter.com/nF90TqKPS8
— BIG TV Cinema (@BigtvCinema) January 14, 2026
మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, చిరంజీవి తన సత్తా చాటారు. అనిల్ రావిపూడి మరోసారి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. త్వరలో విశ్వంభర సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు.


