|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చూడాల్సిందే.. పోలీస్ స్టేషన్‌లోనే పోలీసోడి గుండెల్లోకి బుల్లెట్.. చంపిందెవరన్నదే మిస్టరీ

Published: 13-05-2025, 8:29 AM
ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ చూడాల్సిందే.. పోలీస్ స్టేషన్‌లోనే పోలీసోడి గుండెల్లోకి బుల్లెట్.. చంపిందెవరన్నదే మిస్టరీ

మలయాళ సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్! జోజు జార్జ్ నటించిన ‘ఇరట్టా’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నెట్‌ఫ్లిక్స్ మరియు యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది. ఓ పోలీస్ స్టేషన్‌లో జరిగిన హత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Key Points

1

పోలీస్ స్టేషన్లోనే పోలీసు అధికారి హత్య!

2

జోజు జార్జ్ డ్యుయల్ రోల్లో అద్భుత నటన!

4

ఉత్కంఠభరిత క్లైమాక్స్‌తో ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్!

పోలీస్ స్టేషన్‌లో రక్తపు మడుగు

మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఎన్ని చూసినా తనివి తీరడం లేదా? మరింత థ్రిల్ కోసం చూస్తున్నారా? అయితే ఆ ఇండస్ట్రీ స్టార్ యాక్టర్ జోజు జార్జ్, అంజలి నటించిన ఇరట్టా (Iratta) మూవీ మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పోలీస్ స్టేషన్ లో శవమై కనిపించిన ఏఎస్సై మృతి విచారణ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

ఇరట్టా మూవీలో జోజు జార్జ్ డ్యుయల్ రోల్లో నటించాడు. రెండూ పోలీసు పాత్రలే. ఒకటి ఏఎస్సై వినోద్ కాగా.. మరొకటి డీవైఎస్పీ ప్రమోద్. తన అన్నను ఎంతగానో ద్వేషించే వినోద్ ఓ రోజు పోలీస్ స్టేషన్ లోనే గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి రక్తపు మడుగులో కనిపిస్తాడు.

అదే సమయానికి ఆ పోలీస్ స్టేషన్ కు మంత్రి రావాల్సి ఉండటంతో బయట పోలీసులు, మీడియా హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో పోలీస్ స్టేషన్ లో నుంచి గన్ పేలిన శబ్దం వినిపించడంతో అందరూ లోపలికి వెళ్లి చూస్తారు. అప్పటికే వినోద్ రక్తపు మడుగులో పడి ఉంటాడు. ఆ సమయంలో స్టేషన్ లో మరో ముగ్గురు పోలీసులు ఉంటారు.

జోజు జార్జ్ డ్యుయల్ రోల్

దీంతో వాళ్లలో ఎవరో ఒకరే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తారు. తన తమ్ముడి మృతి కేసులో అన్న ప్రమోద్ కూడా అనుమానితుడిగా ఉంటాడు. అయితే చివరికి అతడే ఈ కేసు విచారణ చేపడతాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వినోద్, ప్రమోద్ ఇద్దరి గతాలను కూడా మూవీలో చూపిస్తారు.

అసలు తన అన్నను వినోద్ ఎందుకంతలా ద్వేషిస్తాడు? పోలీస్ స్టేషన్ లో అతడు రక్తపు మడుగులో కనిపించడానికి కారణం ఎవరు? మద్యం మత్తులో వినోద్ చేసిన ఓ ఘోర తప్పిదం అతని మరణానికి ఎలా కారణమైందన్నది ఈ ఇరట్టా మూవీలో చూడొచ్చు.

సాధారణంగా మలయాళం మూవీ మేకర్స్ ఓ చిన్న లైన్ నే కథగా అల్లి అదిరిపోయే థ్రిల్లర్ మూవీస్ తీస్తుంటారు. అందులోనూ మర్డర్ మిస్టరీలు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అయితే.. క్లైమ్యాక్స్ వరకూ అసలు ఏం జరిగిందో అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోతారు.

ఉత్కంఠభరిత కథానకం

అలాంటిదే ఈ ఇరట్టా మూవీ కూడా. ఓ పోలీస్ స్టేషన్ లోనే మంత్రి పర్యటనకు కొద్ది నిమిషాల ముందు ఓ పోలీస్ అధికారి చనిపోయి పడి ఉండటం, ఆ కేసు విచారణ సాగే తీరు, అందులో పోలీసే అయిన అన్న కూడా అనుమానితుడిగా ఉండటం, అసలు ఎవరి ఊహకందని క్లైమ్యాక్స్ ఈ ఇరట్టా మూవీ బలాలుగా చెప్పొచ్చు.

రోహిత్ ఎంజీ కృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2023లో రిలీజైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి ‘ఇరట్టా’ చూడాల్సిందే. అద్భుతమైన ట్విస్ట్‌లు, టర్న్స్‌తో ఈ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. కచ్చితంగా చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.