
ఓటీటీ ప్రేమికులందరికీ గుడ్ న్యూస్! ఈ వారం (ఆగస్టు 4 నుంచి 10 వరకు) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అనేక ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. లవ్ స్టోరీస్ నుంచి స్పై థ్రిల్లర్స్ వరకు అన్ని రకాల జోనర్లు అందుబాటులో ఉన్నాయి.
Key Points
తెలంగాణ లవ్ స్టోరీ 'మోతేవరి లవ్ స్టోరీ' జీ5లో
రాజకీయ డ్రామా 'మయసభ' సోనీ లివ్‌లో
స్పై థ్రిల్లర్ 'సలాకార్' జియోహాట్‌స్టార్‌లో
తెలుగు వెబ్ సిరీస్ 'అరేబియా కడలి' అమెజాన్ ప్రైమ్‌లో
తెలుగులో వచ్చే కొత్త వెబ్ సిరీస్‌లు
ఓటీటీ లవర్స్ అలర్ట్. ఈ వారం (ఆగస్టు 4 నుంచి 10 వరకు) డిజిటల్ స్ట్రీమింగ్ లో చాలా సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఇందులో తెలుగుతో సహా ఇతర భాషలకు సంబంధించినవి కూడా ఉన్నాడు. లవ్ స్టోరీ, స్పై థ్రిల్లర్, పొలిటికల్ డ్రామా, సర్వైవల్ థ్రిల్లర్ ఇలా డిఫరెంట్ జోనర్ల సినిమాలు, సిరీస్ లు వచ్చేస్తున్నాయి. ఇందులో తప్పకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఏవో ఇక్కడ తెెలుసుకుందాం.
తెలంగాణ మట్టి వాసనను చాటే స్వచ్ఛమైన కామెడీ లవ్ స్టోరీ ‘ మోతెవరీ లవ్ స్టోరీ ’. ఇక్కడ మనషుల్లోని ప్రేమను, అనుబంధాలను, పల్లెటూరి వాతావరణాన్ని ఈ సిరీస్ లో చూసే అవకాశం ఉంది. జీ5 ఓటీటీలో ఆగస్టు 8 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ తో ఫేమస్ అయిన అనిల్ జీల ఇందులో హీరోగా నటించాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
స్పై థ్రిల్లర్స్ మరియు రాజకీయ డ్రామాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు దిగ్గజ రాజకీయ నాయకుల కథ ఆధారంగా తెరకెక్కిన సిరీస్ అని అందరూ చెప్పుకుంటున్న ‘ మయసభ ’ కూడా ఈ వారమే రాబోతోంది. దివంగత వైఎస్సార్, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కథనే ఇది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ పొలిటికల్ డ్రామా సోనీ లివ్ లో ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ ప్లే చేశారు.
స్పై థ్రిల్లర్లకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి సినిమాలు, సిరీస్ లను అందించడంలో జియోహాట్‌స్టార్ ముందే ఉంటుంది. ఇప్పటికే స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 ఆ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ లీడ్ రోల్ లో స్పై థ్రిల్లర్ ‘సలాకార్’ రాబోతోంది. ఈ హిందీ మూవీ ఆగస్టు 8 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇతర భాషల సినిమాలు ఓటీటీలో
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన తండేల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు అలాంటి కథతోనే ఓటీటీ లో వెబ్ సిరీస్ రాబోతుంది. ‘అరేబియా కడలి’ టైటిల్ తో వస్తున్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. ఇందులో సత్యదేవ్ హీరో.
తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఓహో ఎంతన్ బేబీ’ కూడా ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఆగస్టు 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ ఈ ఫిల్మ్ ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతుంది.
ఈ వారం ఓటీటీలో వినోదం పుష్కలంగా ఉంది. మీకు నచ్చిన జోనర్‌ను ఎంచుకుని ఆనందించండి. మంచి సినిమా అనుభవాన్ని కోరుకుంటున్నారా? ఈ జాబితా మీకు సహాయపడుతుంది.


