|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కండిషన్ చెప్పిన కార్తీక్- దీపతో మళ్లీ పెళ్లి- దీపకు అమ్మ నాన్నల స్థానంలో సుమిత్ర దశరథ్

Published: 07-08-2025, 11:13 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కండిషన్ చెప్పిన కార్తీక్- దీపతో మళ్లీ పెళ్లి- దీపకు అమ్మ నాన్నల స్థానంలో సుమిత్ర దశరథ్

కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో దీప తాళి తెంచిన విషయంపై తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కార్తీక్ దీపతో మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అందుకు ఒక షరతు విధించాడు.

Key Points

1

కార్తీక్ దీపతో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి షరతు విధించాడు.

2

దీపకు అమ్మనాన్నల స్థానంలో సుమిత్ర, దశరథ్ ఉంటారు.

4

భారతీయ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరుగుతుంది.

కార్తీక్ యొక్క షరతు

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీప మెడలో తాళి తెంచడంపై జ్యోత్స మీద కోప్పడుతుంది పారిజాతం. అది చేయాల్సింది నువ్వు కాదు మీ బావ. క్షమాపణ చెప్పడానికి మీ అమ్మ, నాన్నను మీ తాత తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరుగుతుందో అని కంగారుపడుతుంది పారు. ఇంతలో శివ నారాయణ వాళ్లు వస్తారు.

సారీ చెప్పారా. వాళ్లు ఏమన్నారు అని పారిజాతం అంటుంది. మనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అన్నట్లుగా శివ నారాయణ అంటుంది. అందుకే మిమ్మల్ని వెళ్లొద్దు అన్నాను అని జ్యో అంటుంది. పిల్లలతో పాటు వాళ్ల తలరాత కూడా కనుంటే బాగుండేది అని దశరథ్ అంటాడు. బావ ఏమైనా అన్నాడా అని జ్యో అంటే.. చాలా అన్నాడు. కండిషన్ పెట్టాడు శివ నారాయణ చెబుతాడు.

జరిగిన తప్పుకు పరిహారంగా కండిషన్ పెడతాను. రేపు చెబుతాను అన్నాడు. ఏం అడిగిన ఇవ్వాలి. ఇది పరువు కోసం సంబంధించింది అని శివ నారాయణ అంటాడు. వాడు ఏం అడిగిన ఇవ్వాల్సిందే. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు అని కోపంగా సుమిత్ర వెళ్లిపోతుంది. దీప కాళ్లు నిన్ను పట్టుకోమంటాడేమో అని పారు అంటే అది చచ్చినా చేయను అని జ్యో అంటుంది.

సుమిత్ర, దశరథ్ దీపకు తల్లిదండ్రులుగా

అది కూడా కాకపోవచ్చు. అసలు మన అంచనాలకు అందితే వాడు కార్తీక్ గాడు ఎందుకు అవుతాడు అని పారిజాతం అంటుంది. మరోవైపు జరిగింది అంతా దీప ఆలోచిస్తుంది. ఇక్కడ నిద్ర పట్టట్లేదు అని నానమ్మ దగ్గరికి వెళ్తుంది శౌర్య. తాతయ్యతో చెప్పిన కండిషన్ ఏం చేస్తున్నావ్ అని దీప అడిగితే.. రేపు అందరికి ఒకేసారి చెబుతాను. అందరూ ఊహించేది నేనెందుకు అడుగుతాను అని కార్తీక్ అంటాడు.

మరుసటి రోజు ఉదయం శివ నారాయణ ఇంటికి కార్తీక్, దీప వెళ్తారు. మెడలో పసుపు తాడుతో దీప ఉంటుంది. కండిషన్ చెబుతానన్నావ్ కదా. మేమంతా ఎదురుచూస్తున్నావ్ అని సుమిత్ర అంటుంది. దీపు చెప్పొచ్చుగా అని జ్యోత్స్న అంటే నాకు తెలియదు అని దీప అంటుంది. కొన్నింటికి న్యాయం చేయలేరు అని కార్తీక్ అంటే నేను మాటిస్తున్నాను, అడుగు అని దశరథ్ అంటాడు.

నా కొడుకు తరఫున నేను మాటిస్తున్నాను అని శివ నారాయణ అంటాడు. దానికి అందరి సమ్మతి కావాలి కార్తీక్ అంటాడు. దానికి పారు, జ్యో ఓకే అంటారు. భారతీయ సాంప్రదాయ ప్రకారం తాళి తీసేది మొగుడు చనిపోయినప్పుడు మాత్రమే. ఆ బాధ నా భార్య 24 గంటల నుంచి పడుతూనే ఉంది. అది పోవాలంటే నాకు నా భార్యకు పెళ్లి చేయండి అని కార్తీక్ అంటాడు.

పెళ్లి నిర్ణయం

ఇది చాలా సింపుల్‌రా. సుమిత్ర తాళి తీసుకురా అని దశరథ్ అంటాడు. పెళ్లి అంటే ఇలా కాదు. దీప అమ్మ నాన్న చేతుల మీదుగా జరిపించాలి అని కార్తీక్ అంటాడు. ఇది మేము ఎలా చేయగలంరా. నా కూతురు పరిహారాన్ని నేనే చేస్తాను, కానీ, ఎలా. నా ఆడపడుచు కోడలు తాళిని నా కూతురు తెంచేసింది అన్న నిందను మోయలేను. ఆ పాపాన్ని నేను కడిగేసుకోవాలి చెప్పరా. మమ్మల్ని ఏం చేయమంటావ్ అని సుమిత్ర అంటుంది.

దానికి ఒక్క మార్గం ఉంది. పొగరుతో, గర్వంతో మాటతో పోయేదాన్ని తాళితో తెంచారు. ఎక్కడైతే నా భార్య తాళి తెగిందో అక్కడే మండపం పెట్టించి, అతిరథుల సాక్షిగా, బంధువుల సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా నా భార్యకు అమ్మ నాన్నలుగా నిలబడి నాతో పెళ్లి చేయించాలి అని కార్తీక్ అడుగుతాడు. అంతా షాక్ అవుతారు. ఎవరు అని జ్యోత్స్న అంటుంది.

దీపకు అమ్మ నాన్నల స్థానంలో సుమిత్ర గారు, దశరథ్ గారు కూర్చోవాలి అని కార్తీక్ అంటాడు. దాంతో అంతా ఉలిక్కిపడతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, కార్తీక్ దీపతో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు, కానీ ఒక షరతుతో. సుమిత్ర, దశరథ్ దీపకు తల్లిదండ్రులుగా ఉంటారు. భారతీయ సంప్రదాయాల ప్రకారం వారి పెళ్లి జరుగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.