|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా అన్వేషణకు బిగ్ షాక్: ఆస్ట్రేలియాలో కేసు నమోదు, వీసా రద్దుకు డిమాండ్!

Published: 04-01-2026, 4:00 AM
నా అన్వేషణకు బిగ్ షాక్: ఆస్ట్రేలియాలో కేసు నమోదు, వీసా రద్దుకు డిమాండ్!
  • యూట్యూబర్ నా అన్వేషణపై ఆస్ట్రేలియాలో కేసు నమోదైంది.
  • హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలే వివాదానికి కారణం.
  • అన్వేషణ వీసా రద్దు చేయాలని భారతీయ ప్రవాసులు డిమాండ్ చేస్తున్నారు.
  • ఇండియాలోనే కాక విదేశాలలో కూడా ఆయనకు వ్యతిరేకత పెరుగుతోంది.

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ వివాదం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. హిందూ దేవతలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఆయనపై ఆస్ట్రేలియాలో కేసు నమోదైంది. విదేశాలలోనూ వ్యతిరేకత మొదలవడంతో, వీసా రద్దుకు భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో “నా అన్వేషణ”పై కేసు నమోదు

Naa Anveshana: ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శివాజీ వివాదాస్పద వ్యాఖ్యల పై అన్వేషణ స్పందిస్తూ గరికపాటి గురించి కూడా మాట్లాడటమే కాకుండా హిందూ దేవతల గురించి అవమానకరంగా మాట్లాడుతూ వీడియోలను విడుదల చేశారు. దీంతో అన్వేషణ కూడా వివాదంలో చిక్కుకున్నారు. అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఇండియాలో హిందువుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. హిందువుల గురించి హిందూ దేవతల గురించి అవమానకరంగా మాట్లాడటంతో 10 లక్షలకు పైగా ఈయనని హిందువులు అన్ ఫాలో చేశారు.

ఈ నేపథ్యంలోనే అన్వేష్ స్పందిస్తూ తాను ఎప్పుడూ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు వాళ్లే వచ్చారు వాళ్లే వెళ్లిపోయారు నేను ఇలాంటి వాటికి భయపడనని తెలిపారు.. అంతేకాకుండా నేను బ్రహ్మ దేవుడిని నన్నెవరూ ఏం చేయలేరు అంటూ కూడా ఇటీవల మరొక వీడియోను విడుదల చేశారు. ఇండియాలోకి తాను అడుగు పెట్టను అంటూ అన్వేషణ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల విదేశాలలో కూడా వ్యతిరేకత తలెత్తుతోంది. తాజాగా అన్వేష్ పై ఆస్ట్రేలియాలో(Australia) కేసు నమోదు చేయడం సంచలనగా మారింది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అన్వేషణ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయనపై స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.

భారతీయ సాంప్రదాయాలను హిందూ దేవతలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆయన ఇకపై ఆస్ట్రేలియాలోకి అడుగుపెట్టకుండా తన వీసా రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను భారతీయులు కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్వేష్ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే ఇలాంటి వ్యక్తులు ఏ దేశంలోనూ అడుగు పెట్టకుండా చేయాలని విదేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా అన్వేష్ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. సొంత దేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఇతడికి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈయన పతనం మొదలైందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆస్ట్రేలియాలో యూట్యూబర్ అన్వేష్ పై ఫిర్యాదు

వీసా రద్దుకు భారతీయుల డిమాండ్

భారతీయ సాంప్రదాయాలను, హిందూ దేవతలను కించపరిచేలా అన్వేష్ వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర అభ్యంతరం

ఆస్ట్రేలియా రాకుండా అతడి వీసా రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరిన భారతీయులు

ఇప్పటికే అన్వేష్ వ్యవహారంపై స్థానిక పోలీసులను కలిసి ఫిర్యాదు… pic.twitter.com/efAf2pzsrR

అంతర్జాతీయంగా తీవ్రమవుతున్న వ్యతిరేకత

— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2026

ఇక అన్వేష్ కేవలం తన యూట్యూబ్ ఛానల్ కోసమే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ తనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే తనకు వ్యూస్ తగ్గిపోతాయో ఆ సమయంలో ఇలాంటి వివాదాస్పద కంటెంట్ ద్వారా రంగంలోకి దిగుతారు. ఈ నేపథ్యంలోనే శివాజీ చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన అన్వేష్ ఆలోచన బెడిసి కొట్టింది .దీంతో ఈయనకు వ్యూస్ రావడం పక్కన పెడితే భారీగా సబ్స్క్రైబర్లు అన్ ఫాలో చేస్తూ షాక్ ఇవ్వడమే కాకుండా ఈయనపై ఇండియాలో, విదేశాలలో కూడా వ్యతిరేకత ఏర్పడి కేసులు నమోదు కావటం గమనార్హం.

దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అన్వేషణకు వ్యతిరేకత రావడంతో, ఆయన పతనం మొదలైందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు యూట్యూబర్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.