|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Naa Anveshana on Ibomma Ravi: ఐ బొమ్మ రవి దొంగ కాదు హీరో..హీరోలను ఏకి పారేసిన నా అన్వేష్!

Published: 13-12-2025, 2:08 AM
Naa Anveshana on Ibomma Ravi: ఐ బొమ్మ రవి దొంగ కాదు హీరో..హీరోలను ఏకి పారేసిన నా అన్వేష్!
  • ఐ బొమ్మ రవి ప్రస్తుతం సినిమా పైరసీ కేసులో రిమాండ్ లో ఉన్నారు.
  • నా అన్వేషణ రవిని హీరోగా అభివర్ణించి, అతనికి పూర్తి మద్దతు తెలిపారు.
  • నిజమైన దొంగలు సినిమా హీరోలే అని నా అన్వేషణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • మూవీ రూల్జ్ అసలు దొంగ అని, హీరోల అధిక రెమ్యూనరేషన్ కారణమని అన్వేష్ అన్నారు.

సినిమా పైరసీ కేసులో ఐ బొమ్మ రవి రిమాండ్ లో ఉండగా, యూట్యూబ్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అతనికి మద్దతుగా నిలిచారు. రవి దొంగ కాదని, హీరో అని ప్రశంసించారు. అసలు దొంగలు సినిమా హీరోలేనని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది.

ఐ బొమ్మ రవికి నా అన్వేషణ మద్దతు

Naa Anveshana On Ibomma Ravi: ఐ బొమ్మ రవి(IBomma Ravi) ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.. సినిమాలను పైరసీలో విడుదల చేస్తూ ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టాలను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే రవి పై దృష్టి సారించిన పోలీసులు తనని అరెస్టు చేసి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి రిమాండ్ లో ఉన్నారు. ఇలా రవి అరెస్టు కావడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈయనపై విమర్శలు చేశారు. కానీ సోషల్ మీడియా వేదికగా రవికి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. అయితే తాజాగా ప్రముఖ యూట్యూబ్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ (Naa Anveshana) యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐ బొమ్మ రవి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా అన్వేష్ ఐ బొమ్మ రవికి పూర్తిస్థాయిలో మద్దతును తెలియజేస్తూ అతను దొంగ కాదని హీరో అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. రవి చేసిన పని తప్పు కాదని, ఉన్న వారి దగ్గర దోచుకొని లేనివారికి పెడుతున్నారు అంటూ అన్వేష్ తెలిపారు. అసలు దొంగలు సినిమా హీరోలే అంటూ ఈయన మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల సినిమా హీరోలందరూ కలిసి సజ్జనార్ తో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో స్టార్ హీరోలు అందరూ కూడా పాల్గొన్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం రవిని హీరోగా పోలుస్తూ కామెంట్లు చేశారు.

సినిమా హీరోలపై అన్వేష్ సంచలన వ్యాఖ్యలు

చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలో ఉన్న వారి దగ్గర దోచుకుని పేదవారికి ఇచ్చారు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేశారు వీళ్లంతా దొంగతనాలు చేస్తే హీరోయిజం అంటారు అదే రవి చేస్తే దొంగ అంటారు అసలు దొంగలు ఎవరు అంటూ? ప్రశ్నించారు . రవి సినిమాలను పైరసీ చేస్తున్నారని తనని అరెస్టు చేశారు అయితే ఆయన జైలులో ఉన్నప్పటికీ కూడా సినిమాలు పైరసీలో వస్తున్నాయని అన్వేష్ తెలిపారు. అసలు దొంగ రవి కాదని, మూవీ రూల్జ్ (Movie Rulez)అని అన్వేష్ తెలిపారు. ఈ దొంగను పట్టుకోవడం బ్రహ్మదేవుడు తరం కూడా కాదు అంటూ ఈయన తెలియజేశారు.

ఇలా సినిమాలు పైరసీలోకి రావడానికి ప్రధాన కారణం మన హీరోలే అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఒకప్పుడు స్టార్ హీరోలు తక్కువ రెమ్యూనరేషన్ తో ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు కానీ ఇప్పుడు ఒక హీరో 100 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఒక్కో సినిమాకు మూడు సంవత్సరాలు సమయం తీసుకుంటున్నారు అలా ఎవరు సినిమాలు చేయమన్నారని ప్రశ్నించారు. ఓటీటీలు రావడం వల్ల థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందనే విషయం గురించి కూడా ఈయన మాట్లాడారు. ఆన్లైన్ షాపింగ్ అందుబాటులో ఉన్నప్పటికి కస్టమర్లు షాపింగ్ మాల్ వెళ్లి కొంటున్నారు. ఎందుకు అక్కడ ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టడం వల్లే, అలాగే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి కూడా హీరోలు ఆఫర్లు ఇవ్వాలని అన్వేష్ తెలిపారు. కుటుంబం మొత్తం థియేటర్ కు వచ్చి సినిమా చూడాలి అంటే అందుకు అనుగుణంగానే కొన్ని ఆఫర్లను కూడా ఇవ్వాల్సి ఉంటుందని అప్పుడే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు అంటూ అన్వేష్ తెలిపారు. కొంతమంది హీరోల రూపంలో పేదవారిని దోచుకుంటున్నారు అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఎంతోమంది అన్వేష్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

అసలు పైరసీకి కారణం ఎవరు?

నా అన్వేషణ వ్యాఖ్యలు సినిమా పైరసీకి, హీరోల పాత్రకు సంబంధించి కొత్త చర్చకు దారితీశాయి. ఐ బొమ్మ రవిని హీరోగా అభివర్ణిస్తూ, నిజమైన దొంగలపై వేలెత్తి చూపడం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం కొనసాగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.