|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఆ మాటలు కట్ చేసుకోండి!’ శివాజీ, గరికపాటిలపై నా అన్వేషణ సంచలన కామెంట్లు.

Published: 27-12-2025, 7:33 AM
'ఆ మాటలు కట్ చేసుకోండి!' శివాజీ, గరికపాటిలపై నా అన్వేషణ సంచలన కామెంట్లు.
  • శివాజీ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
  • నా అన్వేషణ అనసూయకు మద్దతుగా నిలిచి, శివాజీ, గరికపాటి వ్యాఖ్యలను తప్పుపట్టారు.
  • ‘గుడ్డ ముక్కలు విప్పుకొని తిరగండి’ అంటూ అన్వేషణ చేసిన వ్యాఖ్యలు వైరల్.
  • మహిళా కమిషన్ విచారణ అనంతరం శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో శివాజీ చేసిన వస్త్రధారణ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఈ వివాదంపై స్పందిస్తూ, శివాజీ, గరికపాటి వ్యాఖ్యలను ఖండించారు. అనసూయకు మద్దతు తెలుపుతూ, మహిళల స్వేచ్ఛను సమర్థించారు.

శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ

Naa Anveshana: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున శివాజీ(Sivaji) వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శివాజీ అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ సా**న్లు కనిపించేలా డ్రస్సులు వేసుకోవద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోయిన్లు శివాజీకి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయంపై పెద్ద ఎత్తున డిబేట్ లు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై కొంతమంది అనసూయకు మద్దతుగా నిలబడగా మరి కొంతమంది శివాజీకి మద్దతుగా నిలుస్తున్నారు.

శివాజీ చెప్పిన మాటలలో ఏమాత్రం తప్పులేదు కానీ ఆయన చెప్పిన విధానమే కాస్త తప్పుగా ఉంది అంటూ ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా శివాజీకి మద్దతు లభిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ వివాదంపై ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ(Naa Anveshana) తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వివాదం గురించి స్పందిస్తూ పూర్తి మద్దతును అనసూయకు తెలియజేశారు. ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలను ఆయన పూర్తిస్థాయిలో తప్పుపట్టారు. అలాగే గతంలో అమ్మాయిల వస్త్రధారణ గురించి ప్రవచనకర్త గరకపాటి నరసింహారావు(Garikapati Narasimharao) మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

గరికపాటి ప్రస్తావన, నా అన్వేషణ స్పందన

ఇలా అమ్మాయిల వస్త్రధారణ గురించి వీరిద్దరూ మాట్లాడిన వ్యాఖ్యలను అన్వేషణ తప్పు పట్టడమే కాకుండా అమ్మాయిలు మీరు గుడ్డ ముక్కలు విప్పుకొని తిరగండి మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్ మీ సేఫ్టీ ఇంపార్టెంట్ అంటూ అన్వేషణ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై విభిన్న రీతిలో స్పందిస్తూ అన్వేషణపై కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతున్నాయి.

ఇక ఈ వివాదం కారణంగా శివాజీపై కేసు నమోదు కావడంతో ఈయన నేడు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.. ఈ విచారణ అనంతరం శివాజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. నేనేమీ తప్పు చేశానని నాపై ఇలాంటి నిందలు వేస్తున్నారు. కచ్చితంగా నా విషయంలో కొందరు కుట్ర చేస్తున్నారు అంటూ శివాజీ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక సినిమా సెలబ్రిటీల నుంచి శివాజీకి వ్యతిరేకత వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శివాజీ  వ్యాఖ్యలలో ఏమాత్రం తప్పులేదని ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు.. మరి శివాజీ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియాల్సి ఉంది.

మహిళా కమిషన్ విచారణ: శివాజీ ఎమోషనల్

ఈ వివాదంపై నా అన్వేషణ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు కారణమయ్యాయి. శివాజీపై కేసు నమోదు కావడంతో, ఆయన మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఈ ఘటన టాలీవుడ్‌లో మరింత కలకలం సృష్టించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.