|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేటి రాశి ఫలాలు (జూలై 19, 2025): వివాహ యత్నాలు, పనుల పూర్తి

Published: 19-07-2025, 3:13 AM
నేటి రాశి ఫలాలు (జూలై 19, 2025): వివాహ యత్నాలు, పనుల పూర్తి

జూలై 19, 2025 శనివారం నాటి రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు కొన్ని రాశులకు వివాహ యత్నాలు ఫలవంతమవుతాయి, మరికొన్నింటికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతి రాశి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం.

Key Points

1

జూలై 19, 2025 నాటి రాశి ఫలాలను తెలుసుకోండి.

2

కొన్ని రాశులకు వివాహ యత్నాలు ఫలవంతమవుతాయి.

4

ఆర్థిక, ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మేషం నుండి కర్కాటకం వరకు రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 19.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శనివారం, తిథి : కృ. నవమి, నక్షత్రం : భరణి

మేష రాశి వారి ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

వృషభ రాశి వారు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. లక్ష్యం సాధిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ఖర్చులు విపరీతం, గృహ మరమ్మతులు చేపడతారు. పొరుగువారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.

సింహం నుండి వృశ్చికం వరకు రాశి ఫలాలు

గ్రహస్థితి సామాన్యం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. చుట్టుపక్కల వారిని ఒక కంట కనిపెట్టండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి.

కర్కాటక రాశి వారి కార్యసాధనకు ఓర్పు ప్రధానము. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. పెద్దల హితవు ఉత్తేజపరుస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు. ఖర్చులు అధికం, పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ముఖ్యుల సందర్శనం వీలుకాదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది.

ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అయినవారిని సంప్రదిస్తారు. పెద్దల చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

కన్య రాశి వారి వ్యవహారంలో తొందరపాటు తగదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల వ్యాఖ్యలు ప్రభావితం చేస్తాయి. ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. చీటికి మాటికి అసహనం చెందుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. మీపై కొందరు నిఘా పెట్టారని తెలుసుకోండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. విలువైన వస్తువులు జాగ్రత్త.

అన్నివిధాలా అనుకూలమే. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సంతోషకరమైన వార్త వింటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. దైర్యంగా ముందుకు సాగుతారు. పిల్లలకు విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి.

ధనుస్సు నుండి మీనం వరకు రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారి పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. బంధువులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు.

ధనుస్సు రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలించే సమయం త్వరలోనే ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. ధనసహాయం తగదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయాలు సేకరించేందుకు కొందరు యత్నిస్తారు.

లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. నిపుణుల సలహా పాటించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఇంటి పరిస్థితులపై దృష్టి సారించండి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఊరటనిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.

కుంభ రాశి వారి సంప్రదింపులు ఫలిస్తాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. రుణ విముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. చీటికి మాటికి అసహనం చెందుతారు. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది.

మీన రాశి వారు అన్ని రంగాల వారికీ అనుకూల సమయం. మాట నిలబెట్టుకుంటారు. బంధు, మిత్రులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పెద్ద మొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఒక కంట కనిపెట్టండి. కొత్త పనులు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.

ఈ రాశి ఫలాలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.