
కల్కి 2898 AD సినిమా భారీ విజయం సాధించిన తర్వాత, కల్కి 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ, దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు ఆశ్చర్యకరమైన వార్తను ప్రకటించారు.
Key Points
నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రం ఇప్పట్లో ప్రారంభం కాదని ప్రకటించారు.
ప్రధాన నటీనటుల బిజీ షెడ్యూల్, భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యం.
కల్కి 2 చిత్రం రెండు, మూడేళ్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉండటం కూడా కారణం.
కల్కి 2 ఆలస్యానికి కారణం ఏమిటి?
ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రాల్లో కల్కి 2 ఒకటి. గత ఏడాది నాగ్ అశ్విన్ దర్శకుడిగా ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఎడి చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు రాబట్టింది. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి కొనసాగింపుగా కల్కి 2 చిత్రం రావలసి ఉంది. కల్కి మొదటి భాగంలో క్లైమాక్స్ లో కర్ణుడి పాత్రకి సంబంధించిన సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. రెండవ భాగంలో కర్ణుడు, అశ్వథామ మధ్య ఏం జరగబోతోంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే కల్కి 2 ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ తదుపరి ప్రాజెక్టులు
అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పారు. కల్కి 2 ఇప్పట్లో ఉండదని తేల్చేశారు. కల్కి చిత్రం వెండి తెరపైకి రావడానికి ఇంకా రెండు మూడేళ్ళ సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. ఈ కల్కి పార్ట్ 2 ఆలస్యానికి గల కారణాన్ని కూడా నాగ్ అశ్విన్ వివరించారు.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించాల్సిన ప్రధాన నటీనటులంతా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. కల్కి పార్ట్ 2లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రీ ప్రోడుక్ష వర్క్ కి చాలా సమయం కేటాయించాలి. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే సన్నివేశాలు కూడా ఉంటాయి.
కల్కి 2 విడుదల ఎప్పుడు?
కాబట్టి కల్కి 2 చిత్రం ప్రారంభం కావడానికి సమయం పడుతుంది. ఈ ఏడాది కల్కి 2 ప్రారంభం కాదు. దీనికి తోడు ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్నాడు. త్వరలో స్పిరిట్ చిత్రం కూడా ప్రారంభం అవుతుంది. సో కల్కి 2 కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కి ఇది నిరాశే.
చివరగా, కల్కి 2 చిత్ర ప్రేక్షకులకు ఇది నిరాశాజనక వార్త అయినప్పటికీ, చిత్రం అత్యుత్తమంగా ఉండేందుకు చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.


