
📌 Key Points
- హైదరాబాద్‌లో ‘వృషకర్మ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో ఘటన
- కుర్చీ వెనక్కి దొర్లడంతో కింద పడబోయిన నాగచైతన్య
- వెంటనే స్పందించిన సిబ్బంది, సురక్షితంగా కాపాడిన బాడీగార్డ్స్
- ప్రమాదం నుండి తేరుకుని అభిమానులకు ధైర్యం చెప్పిన చైతన్య
హైదరాబాద్‌లో ‘వృషకర్మ’ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నాగచైతన్య ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. కుర్చీ వెనక్కి పడటంతో కింద పడబోతుండగా సిబ్బంది, బాడీగార్డ్స్ వెంటనే స్పందించి ఆయన్ని కాపాడారు.
ప్రసాద్స్ ఐమాక్స్‌లో ‘వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్
Naga Chaitanya:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనైనా సరే లేదా ఎక్కడైనా సరే అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఇబ్బందుల్లోకి నెట్టివేస్తూ ఉంటాయి. కాస్త అప్రమత్తమైతే చాలు ఆ ప్రమాదాల నుంచి ఇట్టే బయటపడవచ్చు.. ఈ క్రమంలోనే తాజాగా హీరో నాగచైతన్య (Naga Chaitanya) కూడా వేగంగా ఆ ప్రమాదం నుండి తేరుకొని ఎటువంటి గాయాలు లేకుండా ప్రమాదాన్ని తప్పించుకొని అభిమానులకు స్వాంతన కలుగజేశారు. ఇక అసలు ఏం జరిగింది? నాగచైతన్య ప్రమాదం బారిన పడడం ఏంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమ్యాక్స్ (Prasads PCX) థియేటర్‌లో మార్చి 5, 2026న ‘వృషకర్మ’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.స్టేజ్ పైన కూర్చున్న సమయంలో, ఒక్కసారిగా కుర్చీ వెనక్కి దొర్లడంతో ఆయన కింద పడబోతున్న సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మరియు బాడీగార్డ్స్ వెంటనే ఆయన్ని పట్టుకున్నారు. చైతన్య కూడా చాలా వేగంగా తేరుకుని, ఎటువంటి గాయం కాకుండానే మళ్ళీ నిలబడ్డారు.చిన్న ప్రమాదం జరిగిన తర్వాత చైతన్య ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. పైగా, కంగారు పడుతున్న అభిమానులకు తాను బాగున్నానని సైగ చేస్తూ, చిరునవ్వుతో స్పీచ్ తో ముందుకు సాగారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కుర్చీ నుండి పడబోయిన నాగచైతన్య
నాగచైతన్య విషయానికి వస్తే.. ప్రస్తుతం సరికొత్తగా పాన్ ఇండియా మిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వృషకర్మ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఒక ట్రెజర్ హంటర్ గా , సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్త లుక్కులో కనిపిస్తున్నారు. విరూపాక్ష సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న కార్తీక్ దండు వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి , నాగచైతన్యకు జోడిగా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో నాగచైతన్య , మీనాక్షి జంటగా నటించగా.. స్పర్శ్ శ్రీ వాత్సవ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ జానర్ కి నాగచైతన్య కొత్త అని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. కచ్చితంగా ఈ సినిమా నాగచైతన్య కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా రికార్డులు క్రియేట్ చేస్తుందని.. అభిమానులు , సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి వృషకర్మ సినిమాతో స్టాండర్డ్ హిట్ ను నాగచైతన్య అందుకుంటారో లేదో చూడాలి.
నాగచైతన్యకు తప్పిన ప్రమాదం..
సురక్షితంగా బయటపడిన హీరో, ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
హైదరాబాద్ ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ ఈవెంట్‌లో హీరో నాగచైతన్యకు ప్రమాదం తప్పింది. స్టేజీపై ఆయన కూర్చున్న కుర్చీ అకస్మాత్తుగా వెనక్కి విరిగిపోగా, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పట్టుకోవడంతో గాయాలు కాలేదు. ఈ ఘటనతో కంగారుపడిన అభిమానులను చూసి,… pic.twitter.com/nSQXYsTFx7
— ChotaNews App (@ChotaNewsApp) March 5, 2026
నాగచైతన్య క్షేమంగా ఉండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ‘వృషకర్మ’ చిత్రం కోసం ఎదురుచూస్తూ, ఆయన కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలవాలని ఆశిద్దాం.


