
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా రిలీజ్ తేదీని నిర్మాతలు వాయిదా వేశారు. సినిమా పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాత నాగవంశీ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
Key Points
విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' సినిమా రిలీజ్ వాయిదా
నిర్మాత నాగవంశీ ట్వీట్ ద్వారా వాయిదాను ప్రకటించారు
త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు తెలిపారు
కింగ్‌డమ్ రిలీజ్ వాయిదా
విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్ . జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా పూర్తి కాకపోవడంతో మే 30కి వాయిదా వేశారు. అప్పటికీ కింగ్‌డమ్‌కు మెరుగులు దిద్దడం కంప్లీట్ కానందున జూలై 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఇదే రోజు నితిన్ తమ్ముడు చిత్రం విడుదలవుతోంది.
మళ్లీ వాయిదా అయితే కింగ్‌డమ్ ( Kingdom Movie ) వాయిదా పడటం ఖాయం అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. కింగ్‌డమ్ వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశాడు. నేను ఏం పోస్ట్ చేసినా కింగ్‌డమ్ సినిమా గురించి తిట్లు వస్తూనే ఉంటాయని నాకు తెలుసు. మీకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు మా టీమ్ ఎంతగానో కృషి చేస్తోంది. మీకు మాటిస్తున్నా.. కింగ్‌డమ్ చూశాక మీకు కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది.
నిర్మాత నాగవంశీ ప్రకటన
కింగ్‌డమ్‌దే విజయం నేను ఎంతో నమ్మితే కానీ ఇలా మాట్లాడనని మీకు తెలుసు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా మీ క్రియేటివిటీ అంతా నాపై చూపిస్తారు. నేను సినిమా చూసి చెప్తున్నా.. కింగ్‌డమ్‌దే గెలుపు. త్వరలోనే అదిరిపోయే రిలీజ్ డేట్ టీజర్, సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో కలుద్దాం అన్నాడు. దీంతో కింగ్‌డమ్ వాయిదా కన్‌ఫార్మ్ అయిపోయింది.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?
నిర్మాత నాగవంశీ సినిమా గురించి ఆశాభావంతో ఉన్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.


