
ఇటీవల బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా మెప్పించలేకపోయిన ‘వార్-2’ చిత్రంపై నిర్మాత నాగవంశీ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. యష్ రాజ్ ఫిలిమ్స్, ఆదిత్య చోప్రాను నమ్మి తాము దొరికిపోయామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Key Points
‘వార్-2’ డిజాస్టర్‌పై నిర్మాత నాగవంశీ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.
యష్ రాజ్ ఫిలిమ్స్, ఆదిత్య చోప్రాను నమ్మి దొరికిపోయామని వంశీ అన్నారు.
వంద కోట్లు వెచ్చించినా లాభాలు రాలేదని, ట్రోల్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు మూవీతో దొరకలేదని హ్యాపీ అని, 'లోకా' గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
వార్-2 డిజాస్టర్‌పై నాగవంశీ స్పందన
ప్రతి సినిమాను ఎన్నో ఆశలతో తెరకెక్కిస్తారు. ప్రేక్షకులను ఎలాగైనా మెప్పించాలని చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ కష్టమైన సీన్స్‌ను సైతం ఇష్టంగా చేస్తారు. కొంతమంది హిట్ అవుతుందని నమ్మి భారీ బడ్జెట్‌తో సినిమాలు చేస్తుంటారు. దర్శకనిర్మాతలు కొన్ని చిత్రాలపై విపరీతమైన నమ్మకం పెట్టుకుంటారు. కానీ కొన్ని చిత్రాలకు షూటింగ్ సమయంలో వచ్చినంత హైప్ కూడా రాదు. భారీ అంచనాల మధ్య వచ్చి ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడతాయి. ఆ తర్వాత ఏం చేయలేక తప్పును ఒప్పుకుంటారు. ఇక ‘వార్-2’(War-2) సినిమా కూడా బాక్సాఫీసు వద్ద అనుకున్నంతగా మెప్పించలేకపోయింది.
ఈ మూవీని తెలుగులోకి తీసుకువచ్చిన నిర్మాత నాగవంశీ విడుదలకు ముందు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపు వంద కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేసినప్పటికీ లాభాలు రాలేదు. పైగా నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. తాజాగా, ‘వార్-2’ డిజాస్టర్ కావడంపై నాగవంశీ (Naga Vamsi)స్పందించారు. ‘‘నేను ఆ రోజు స్టేజ్ మీద బాగా ఎగ్జైట్ అయ్యాను. తప్పులు అందరూ చేస్తారు కదా? మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా? నేను, ఎన్టీఆర్ అన్నా.. యశ్ చోప్రా, యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ల (ఆదిత్య చోప్రా)(Aditya Chopra)ను నమ్మాం.
యష్ రాజ్ ఫిలిమ్స్ పై కీలక వ్యాఖ్యలు
వాళ్ల వైపు తప్పు జరిగింది. మనం దొరికాం.. మేం చేసిన సినిమా కాదు కదా.. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్‌ని నమ్మాం. తప్పు జరిగింది.. దొరికాం.. ట్రోల్ చేస్తున్నారు.. మన తెలుగు మూవీతో దొరకలేదు..అందుకే హ్యాపీ’’ అని అన్నారు. కాగా.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పాత్రలో నటించిన ‘ఈ వార్-2’ చిత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చింది. దీనిని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా.. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌గా నిలిచింది.
ట్రోల్స్, లోకా మూవీపై వంశీ కామెంట్స్
‘లోకా’ విషయంలో వారు అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా.. నాగవంశీ సెన్సేషనల్ కామెంట్స్
నాగవంశీ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పెద్ద ప్రొడ్యూసర్‌లను నమ్మినందుకే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చేసిన కామెంట్స్, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న సవాళ్లను మరోసారి స్పష్టం చేశాయి.


